కింగ్ నాగార్జున నటించిన మన్మథుడు 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి డివైడ్ టాక్ వస్తోంది. ఫిలిం క్రిటిక్స్ కూడా మిక్స్డ్ రివ్యూలు ఇస్తున్నారు. నాగార్జున ఐకానిక్ చిత్రం మన్మథుడు టైటిల్ తో వచ్చిన మన్మథుడు 2 నిరాశపరిచే చిత్రంగా మిగిలిపోనుంది. 

ఈ చిత్రంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అడల్ట్ కామెడీ, రొమాన్స్ కు ప్రాధాన్యత ఇచ్చి కథని పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మన్మథుడు 2 చిత్రంతో రాహుల్ రవీంద్రన్ సతీమణి చిన్మయిపై తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. చిన్మయి తరచుగా సోషల్ మీడియాలో మహిళలకు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎవరైనా మహిళలని కించపరిచే విధంగా మాట్లాడితే వెంటనే చిన్మయి వారికి కౌంటర్ ఇస్తుంది. 

ఇటీవల అర్జున్ రెడ్డి దర్శకుడు చేసిన వ్యాఖ్యలపై చిన్మయి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. మన్మథుడు 2 చిత్రంపై చిన్మయి ఎందుకు స్పందించడం లేదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ స్మోకింగ్ సీన్స్, నటి ఝాన్సీ తో లిప్ లాక్ సన్నివేశం, అడల్ట్ డైలాగ్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

వీటిపై చిన్మయి తన భర్తని ఎందుకు ప్రశ్నించడం లేదు అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. చిన్మయిని ట్రోల్ చేస్తూ అనేక పోస్ట్స్ సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. చిన్మయి తన ఫ్యామిలి పట్ల ఒకలా, ఇతరులపై మరోలా ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.