రష్మిక డీప్ ఫేక్ వీడియోపై చిన్మయి సెటైరికల్ కామెంట్స్.. ఆల్రెడీ ఎక్స్ పోజింగ్ చేస్తోంది కదా అనేవాళ్లకు..
రష్మిక ఆల్రెడీ ఎక్స్ పోజింగ్ చేస్తుంది కదా అని లాజిక్ మాట్లాడేవాళ్ళకు చిన్మయి అదిరిపోయే విధంగా పరోక్షంగా సమాధానం ఇచ్చింది.

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రష్మిక మందన పేరు జాతీయ వ్యాప్తంగా ట్రెండింగ్ గా మారింది. రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో బాధితురాలిగా మారిన సంగతి తెలిసిందే. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కొందరు సెలెబ్రిటీలని టార్గెట్ చేస్తున్నారు. వారి ముఖాలన్ని మార్ఫింగ్ చేస్తూ వీడియోలు సృష్టిస్తున్నారు.
ఈ క్రమంలో రష్మిక మందన ముందుగా బలైంది. రష్మిక పేస్ ని ఇంకొకరికి టెక్నాలజీ ద్వారా ఫేక్ చేసి వీడియో ఇంటర్నెట్ లో వదిలారు. దీనితో దేశవ్యాప్తంగా రష్మికకి మద్దతు లభిస్తోంది. టెక్నాలజీని ఇలాంటి చెత్త పనులకు కాకుండా ఉపయోగపడేందుకు వినియోగించాలని అంతా విమర్శిస్తున్నారు. స్టార్ సెలెబ్రిటీలు చాలామంది రష్మికకి మద్దతు తెలిపారు.
అయితే రష్మిక డీప్ ఫేక్ వీడియో అంతలా వైరల్ కావడం దానిపై సెలెబ్రిటీలు స్పందించడంతో పెద్ద చర్చే జరుగుతోంది. కొందరు రష్మిక సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేస్తుంది. ఈవెంట్స్ లో గ్లామర్ షో చేస్తుంది. ఈ వీడియోకి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నటి మాధవీలత కూడా ఇదే తరహాలో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై చిన్మయి సెటైరికల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రష్మిక ఆల్రెడీ ఎక్స్ పోజింగ్ చేస్తుంది కదా అని లాజిక్ మాట్లాడేవాళ్ళకు చిన్మయి అదిరిపోయే విధంగా పరోక్షంగా సమాధానం ఇచ్చింది. 'చెత్త లాజిక్ అలెర్ట్' అంటూ పోస్ట్ పెట్టింది. రష్మిక పేరు పేర్కొనలేదు. ప్రస్తుతం చిన్మయి పోస్ట్ వైరల్ గా మారింది.