భారతదేశ సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమానికి బలాన్ని చేకూర్చిన గాయని చిన్మయి. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి మీటూ ఉద్యమంలో పలు సినీ ప్రముఖుల పేర్లను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా నటుడు రాధారవి ని ఆమె టార్గెట్ చేస్తూ వ్యవహరిస్తున్న తీరు మరింత చర్చనీయాంశంగా మరింది. 

సౌత్ బుల్లితెర సినీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ అయిన రాధారవి ఇటీవల చిన్మయి ని కమిటీని నుంచి నిషేదించారు. దీంతో చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు  అతనికి వచ్చిన బిరుదు నకిలీ అని ఆమె తేల్చేశారు. రెండేళ్ల వార్షిక రుసుమును సంఘానికి చెల్లించలేదని ఆమెపై వేటు వేయడంతో చిన్మయి ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నారు. 

మీటూ ఆరోపణలు చేసినందుకు కావాలనే తనపై ఈ విధంగా కక్ష్య సాధిస్తున్నారని తన సభ్యత్వం రద్దు చేయడం ఆయనకు సాధ్యం కాదని చెబుతూ నేను శాశ్వత సభ్యురాలినని చిన్మయి పేర్కొన్నారు. ఇక అదే విధంగా రాధారవి కి వచ్చిన ఒక బిరుదు అబద్దమని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 

మలేషియా  ప్రభుత్వం డటోక్‌ అనే ఒక  ప్రతిష్టాత్మకమైన బిరుదుతో సత్కరించింది అనడంలో ఎలాంటి నిజం లేదని ఇంతవరకు షారుక్ ఖాన్ కి మాత్రమే ఆ దేశం నుంచి బిరుదు అందింది అని చిన్మయి సోషల్ మీడియా ద్వారా రాధారావికి కి వచ్చిన బిరుదు నకిలీ అని తెలియజేశారు. దీంతో వీరి మధ్య వివాదం మరింత సీరియస్ గా మారింది.