మీటూ వేడి ఎప్పుడు లేని విధంగా ప్రతి ఇండస్ట్రీలో సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా తమిళ్ ఇండస్ట్రీలో రోజు రోజుకి డోస్ పెరుగుతోంది. తమిళ రచయిత వైరముత్తుపై చిన్మయి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే బాధితులకు కూడా ఆమె మద్దతు పలుకుతోంది. చిన్మయికి కూడా చాలా మంది నుంచి సపోర్ట్ లభిస్తోంది.

అయితే కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ చిన్మయి పై ట్రోల్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెయిన్ గా తమిళ్ నెటిజన్స్ ఈ సింగర్ పై ఊహించని మెమ్స్ చేస్తూ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. రీసెంట్ గా ఈ విషయంపై చిన్మయి ఘాటుగా స్పందించింది. 

రీసెంట్ గా కొందరు తమిళ సమాజం పురుషులు ఈ విధంగా మెమ్స్ షేర్ చేస్తున్నారు. దీని అర్ధం.. మీరు ఈ విధంగా చీర కట్టుకొని ప్రవర్తించాలి అంటూ పైన ఉన్న పదానికి అర్ధం చెబుతూ.. కానీ మీరు మాత్రం ఎవరితో అయినా పడుకునేందుకు సై.. అని కింద ఉన్న అర్ధం గురించి వివరించారు. దీంతో చిన్మయి సమాధానం చెబుతూ.. నా మెడ నొప్పి తగ్గడానికి భుజానికి ఒక పట్టి వేసుకుంటే ఇలా అన్నారు.. అది బ్రా స్ట్రాప్ కాదని తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చింది. 

దీంతో చిన్మయి మద్దతుదారులు రీ ట్వీట్ చేస్తూ  ట్రోలర్స్ సిగ్గు వచ్చేలా సమాధానం చెప్పి అదిరిపోయేలా చెంపపెట్టు ఇచ్చిందని కౌంటర్లు వేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబందించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.