Asianet News TeluguAsianet News Telugu

`ఆదిపురుష్‌` హీరోయిన్‌, దర్శకుడి ముద్దుల వివాదంపై చిలుకూరు బాలాజీ టెంపుల్‌ ప్రధాన అర్చకుడు ఫైర్‌

తిరుమల కొండపై హీరోయిన్‌ కృతి సనన్‌, దర్శకుడు ఓం రౌత్‌ ముద్దు పెట్టుకోవడం సంచలనంగా మారింది. ఇది పెద్ద వివాదంగా మారిన నేపథ్యంలో తాజాగా చిలుకూరు బాలాజీ టెంపుల్‌ ప్రధాన అర్చకులు  సీఎస్ రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

chilkur balaji temple pradhana archakulu fire on adipurush heroine kriti sanon and director kiss controversy arj
Author
First Published Jun 8, 2023, 9:50 AM IST | Last Updated Jun 8, 2023, 9:52 AM IST

`ఆదిపురుష్‌` దర్శకుడు ఔం రౌత్‌, హీరోయిన్‌ కృతి సనన్‌.. వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. నిన్న(బుధవారం) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం వెళ్తూ ఈ ఇద్దరు హగ్‌ చేసుకున్నారు. కృతికి ముద్దు పెట్టాడు దర్శకుడు ఓం రౌత్‌. ఇది సంచలనంగా మారింది. పెద్ద వివాదంగా మారిన నేపథ్యంలో తాజాగా చిలుకూరు బాలాజీ టెంపుల్‌ ప్రధాన అర్చకులు  సీఎస్ రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపై ఇలాంటి పనులు సమ్మతం కాదని ఆయన మండిపడ్డారు. 

ఆయన మాట్లాడుతూ, తిరుమల కొండపై `ఆదిపురుష్‌` చిత్ర బృందం దర్శనానికి వెళ్లడం సంతోషం. స్వామి వారి దర్శనం అనంతరం సీతమ్మ పాత్ర పోషించిన అమ్మాయి, దర్శకుడు బయటకు వచ్చారు. స్వామి వారి శేషవస్త్రం ధరించి కౌగిలి, చుంబనం అది మనసుకు ఆందోళన కలిగించే విషయం. తిరుమల కొండపైన ఇలాంటి వికారమైన చేష్టలు చేయకూడదు. సమ్మతం కాదని  రంగరాజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆయన ఇంకా చెబుతూ, భక్తి, ఆలోచన నియమాలు ఉండాలి. స్వామి వారి తిరుమల కొండకు భార్యాభర్తలు కలిసి వచ్చినా సరే కళ్యాణోత్సవంలో పాల్గొన్నా కూడా ఆలోచనా విధానంలో జాగ్రత్త పడతారు. వేరే వికారమైన ఆలోచన రాకుండా ఉండాలని జాగ్రత్త పడతారు. అటువంటి ప్రదేశంలో బహిరంగంగా కౌగలించుకుని, చుంబనం చేయడం దారుణమైన కార్యక్రమం. సాధారణంగా ఇటువంటి విషయాలు మాట్లాడాలని నేను టీవీ ఛానల్స్ ముందుకు రాను. కానీ, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహానుభావుడు రాములు వారి పాత్ర పోషించినప్పుడు వాళ్ళను దైవ సమానులుగా ప్రేక్షకులు చూశారు. వాళ్ళూ అంతే భక్తి శ్రద్దలతో ఉన్నారు. ఆ విధంగా నడుచుకోవాలి.  సీత పాత్రకు కృతి సనన్ సూట్ కాలేదు` అని తెలిపారు రంగరాజన్‌. 

తిరుమలను భూలోక వైకుంఠంగా భావిస్తామని, అటువంటి ప్రదేశంలో కోట్లాది మంది భక్తులు ఉన్న చోట అటువంటి పనులు (ముద్దులు, హగ్గులు) ఏమిటని రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పనులు సీతారాములను అవమానించడమే అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంటుంది. తిరుపతిలో `ఆదిపురుష్‌` సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌తో సినిమాపై భారీ హైప్‌ వచ్చింది. ఆ క్రేజ్‌ పీక్‌లోకి వెళ్లింది. అంతా పాజిటివ్‌గా సాగుతుందనుకునే సమయంలో కృతి సనన్‌, దర్శకుడు చేసిన పని ఇప్పుడు ఆ సినిమా ప్రతిష్టని దెబ్బతీసేలా ఉండటం గమనార్హం. మరి ఇది మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుంది, దీనిపై హీరోయిన్‌, దర్శకుడు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios