నేడు చిల్డ్రన్స్ డే పురస్కరించుకుని హీరో నాని స్పెషల్ వీడియో, ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. కొడుకు అర్జున్ తో అల్లరి చేస్తున్న ఆ వీడియో వైరల్ గా మారింది.
నవంబర్ 14 మాజీ ప్రధాని జవహర్ లాల్ జయంతి. ఆయన జన్మదినం పురస్కరించుకొని బాలల దినోత్సవం జరుపుకుంటారు. పిల్లల అభివృద్ధి, విద్య, సంక్షేమం పై అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏటా చిల్డ్రన్స్ డే వేడుకలు జరుగుతాయి. నేచురల్ స్టార్ నాని చిల్డ్రన్స్ సందర్భంగా స్పెషల్ వీడియో, ఫోటో షేర్ చేశాడు. తన కొడుకు అర్జున్ తో వెకేషన్ లో దిగిన హ్యాపీ మూమెంట్ కి సంబంధించిన ఫోటో ఆయన షేర్ చేశారు.
ఈ సందర్భంగా నాని ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. మరోవైపు నాని దసరా మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా దసరా తెరకెక్కుతుంది. కోల్ మైన్ వర్కర్ గా నాని డీగ్లామర్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్ గా చేస్తున్న కీర్తి సురేష్ సైతం పల్లెటూరి అమ్మాయి పాత్ర చేస్తున్నారు. దసరా మూవీ ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడు శ్రీనాథ్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2023 సమ్మర్ కానుకగా విడుదల కానుంది.
కాగా నాని సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన అంటించిన శ్యామ్ సింగరాయ్ మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. ఆయన గత రిలీజ్ అంటే సుందరానికీ దారుణ పరాజయం చవిచూసింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా కమర్షియల్ గా ఆడలేదు. దీంతో దసరా మూవీతో ఇండియా మొత్తం వినపడేలా హిట్ కొట్టాలి అనుకుంటున్నాడు. నాని ప్రయత్నాలు మరి ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
