Asianet News TeluguAsianet News Telugu

ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హీరో అయ్యాడు.. గుర్తు పట్టారా..

  • చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంద్ర, చూడాలనివుంది సహా 50 చిత్రాల్లో నటించిన తేజ
  • ఇప్పుడు తేజ హీరోగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ 
  • హరి దర్శకత్వంలో తేజ హీరోగా బెక్కెం గోపి చిత్రం
child artist teja become hero now and drastic change

`చూడాల‌ని ఉంది`, `ఇంద్ర‌`, `యువ‌రాజు`తో పాటుగా దాదాపు 50 సినిమాల్లో బాల‌న‌టుడిగా తెర‌పై క‌నువిందు చేసిన ఘ‌న‌త మాస్ట‌ర్ తేజ సొంతం.  మాస్ట‌ర్ తేజ ఇప్పుడు తేజ‌గా మారి హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఈ లాంచింగ్ చిత్రాన్ని బెక్కెం  వేణుగోపాల్ (గోపి) నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి సంస్థ‌లో ద‌ర్శ‌క‌త్వ విభాగంలో దాదాపు ఎనిమిదేళ్లు ప‌నిచేసిన హ‌రి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

child artist teja become hero now and drastic change

 

నిర్మాత గోపి మాట్లాడుతూ `` క‌థ అద్భుతంగా కుదిరింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లో  జ‌రిగే యూత్‌ఫుల్ ల‌వ్ స్టోరీ ఇది. కుటుంబ‌స‌మేతంగా చూసేలా ఉంటుంది. సెప్టెంబ‌ర్ 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది. `ఉయ్యాల  జంపాల‌`, `స్వామిరారా` చిత్రాల‌కు స్వ‌రాలు స‌మ‌కూర్చిన  సంగీత ద‌ర్శ‌కుడు స‌న్నీ ఎం.ఆర్‌. మా సినిమాకు బాణీలిస్తున్నారు. ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం`` అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios