ట్రైలర్: చీకటి గదిలో చితక్కొట్టుడు(18+) .. బూతు డోస్ మాములుగా లేదు!
సినిమాల ప్రభావం జనల మీద ఎంత ఉంటుందో తెలియదు గాని ఇంగ్లీష్ సినిమాల ప్రభావం మన ఇండస్ట్రీలకు బాగా అలవాటైపోతుందని ఇలాంటి సినిమాలను చుస్తే అర్ధమవుతోంది.
సినిమాల ప్రభావం జనల మీద ఎంత ఉంటుందో తెలియదు గాని ఇంగ్లీష్ సినిమాల ప్రభావం మన ఇండస్ట్రీలకు బాగా అలవాటైపోతుందని ఇలాంటి సినిమాలను చుస్తే అర్ధమవుతోంది. ఓ విధంగా A సర్టిఫికెట్ ను కరెక్ట్ గా వాడుకుంటున్నారా అనిపిస్తోంది.
డబుల్ మీనింగ్ డైలాగులతో పాటు ఘాటుగా కనిపించే సీన్లతో చీకటి గదిలో చితకొట్టుడు అనే సినిమాను తెరకెక్కించారు. టీజర్ తోనే రచ్చ చేసిన ఈ అడల్ట్ సినిమా నుంచి ఇప్పుడు 'ట్రైలర్ కూడా రిలీజయింది. ఇది పక్కా అడల్ట్ సినిమా అని చిత్ర యూనిట్ ముందే చెప్పేస్తోంది. సంతోష్ పి జయకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆదిత్ - నిక్కీ ప్రధాన పాత్రలో నటించారు.
పోసాని కృష్ణ మురళి - రఘుబాబు వంటి సీనియర్ కమెడియన్స్ తో పాటు తాగుబోతు రమేష్ - మిర్చి హేమంత్ వంటి నటులు కూడా సినిమాలో కీలకపాత్రలో నటించారు. త్వరలో రానున్న ఈ సినిమా ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలను రేవుపుతోంది. మరి రిలీజ్ అనంతరం ఈ అడల్ట్ కామెడీ ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తుందో చూడాలి.
Asianet News special
భారీ నష్టాలతో దెబ్బ కొట్టిన రీసెంట్ మూవీస్