నిన్న మొన్నటి వరకు సెన్సార్ సమస్యల్లో ఉండే ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమా  ఆ ఇబ్బందులను అధిగమించి ఎట్టకేలకు ఈ రోజు రిలీజ్ కి సిద్ధమైంది . అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ప్రకంపనలు సృష్టిస్తోంది . ట్రైలర్ మొత్తం బూతు డైలాగ్ లతో నిండిపోవటంతో మంచి క్రేజే వచ్చింది. తిట్టుకుంటూనే తెగ చూసేసారు . యువత బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి పెద్ద స్కెచ్ వేశారని విమర్శలు వస్తున్నా ఓపినింగ్స్ బాగానే వస్తాయనే నమ్మకంతో మంచి బిజినెస్సే జరిగిందని సమాచారం.  

టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఇది మరీ బోల్డ్ కంటెంట్ చిత్రంలా ఉండటం కలిసొచ్చే అంశమని భావిస్తున్నారు. ఈ సినిమాలో సెక్స్ కోరికలు ఉన్న ఓ దెయ్యం ఇద్దరు యువకులను నానా తిప్పలు పెడుతుంటుంది. అయితే సినిమా సెన్సార్  లో చాలా భాగం పోయిందని, సినిమాకు ప్లస్ అవుతాయనుకున్న బూతు సీన్స్ నిర్దాక్ష్యణంగా కట్ చేసి పారేసిందని చెప్పుకుంటున్నారు.

ముఖ్యంగా దెయ్యంతో జరిగే కొన్ని శృంగార సన్నివేశాలు జుగుప్సగా ఉన్నాయని వాటినే వద్దందని చెప్పుకుంటున్నారు. అదే జరిగితే సినిమా ఏ మేరకు నడుస్తుందనేది డౌటే అంటున్నారు విశ్లేషకులు. ఏదో ఎక్సపెక్టే చేసి వెళ్లినవాళ్లకు అది ఖచ్చితంగా నిరాశపరిచే అంశం అవుతుంది. 

‘పీఎస్వీ గరుడవేగ, 24కిస్సెస్‌’ వంటి విభిన్న చిత్రాలలో నటిస్తూ.. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందిన హీరో ఆదిత్ అరుణ్ ఈ సినిమాలో చేసారు.  అదిత్ అరుణ్ మాట్లాడుతూ...‘‘ తమిళంలో డిఫరెంట్‌ స్టోరీ అయితేనే వారు చూస్తారు. తెలుగులో అలా కాదు మనం ఈ జోనర్‌లో అయినా చేయవచ్చు కానీ అది ప్రేక్షకులని పూర్తిగా ఎంటర్‌టైన్‌ చేయగలగాలి అప్పుడే వారు చూస్తారు. అందుకే ఈ సినిమా విజయం పట్ల మా టీమ్‌ అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.  ’’ ఆదిత్ అరుణ్ చెప్పుకొచ్చారు.

బ్లూ ఘోస్ట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సంతోష్‌ పి జయకుమార్‌ దర్శకత్వంలో అడల్ట్‌ హారర్‌ కామిడీగా ఈ చిత్రం తెరకెక్కింది.