టీజర్, ట్రైలర్ లతో రీసెంట్ గా యూట్యూబ్ లో వ్యూస్ తో చితకొట్టిన 'చీకటి గదిలో చితకొట్టుడు' సినిమాకు సెన్సార్ నుంచి కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక తెలుగు సినిమాలో బూతుల డోస్ ఎక్కువైందని చెప్పాలి. ట్రైలర్ వదిలితే జనల నుంచి రెస్పాన్స్ గట్టిగానే వస్తుంది అనుకున్న చిత్ర యూనిట్ మధ్యలో సెన్సార్ బోర్డు ఉన్న సంగతి మర్చిపోయింది. 

ఎదో రెండు మూడు సీన్స్ ఉంటె కట్ చేసి సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వవచ్చు. కానీ మొత్తంగా బూతులే ఉంటె సినిమాకు ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదని సెన్సార్ యూనిట్ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఆదిత్ అరుణ్ - హేమంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను తమిళ్ మూవీని ఆధారంగా చేసుకొని తెరకెక్కించారు. 

అసలైతే సినిమా మార్చ్ సెకండ్ వీక్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాలి. కానీ సెన్సార్ కష్టాలు మొదలవ్వడంతో సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వడమే కష్టంగా ఉంది. ఇక ఏప్రిల్ వరకు పెద్ద సినిమాలేవి లేకపోవడంతో ఎలాగైనా ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసి లాభాలను అందుకోవాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నాడు. మరి సెన్సార్ యూనిట్ సినిమాకు అసలు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అని తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.