Asianet News TeluguAsianet News Telugu

Siddharth : మరింత చిక్కుల్లో హీరో సిద్ధార్థ్.. సైనా నెహ్వాల్ ట్వీట్ వివాదంలో చెన్నై పోలీసుల సమన్లు

హీరో సిద్దార్థ్ కు చిక్కులు మరింత ఎక్కువయ్యాయి. సిద్దార్థ్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలని ధైర్యంగా చెబుతుంటాడు. సినీ రాజకీయ అంశాల గురించి సిద్దార్థ్ తరచుగా ట్విట్టర్ లో స్పందించడం చూస్తూనే ఉన్నాం. 

Chennai police summons actor Siddharth over his comments on Saina
Author
Hyderabad, First Published Jan 21, 2022, 9:22 AM IST

హీరో సిద్దార్థ్ కు చిక్కులు మరింత ఎక్కువయ్యాయి. సిద్దార్థ్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలని ధైర్యంగా చెబుతుంటాడు. సినీ రాజకీయ అంశాల గురించి సిద్దార్థ్ తరచుగా ట్విట్టర్ లో స్పందించడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇటీవల సిద్దార్థ్ చేసిన ఓ ట్వీట్ పెను దుమారంరేపింది. సైనా నెహ్వాల్ ని ఉద్దేశిస్తూ చేసిన ఆ ట్వీట్ తో సిద్దార్థ్ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఆ ట్వీట్ వివాదం మరింత ముదురుతూ సిద్దార్థ్ ని చిక్కుల్లోకి నెడుతోంది. 

సైనా నెహ్వాల్ పై ట్విట్టర్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను చెన్నై పోలీసులు సిద్దార్థ్ కు తాజాగా సమన్లు జారీ చేశారు. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గురువారం సిద్దార్థ్ పై రెండు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చెన్నై పోలీస్ కమిషనర్ ధృవీకరించారు. 

చెన్నై పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నటుడు సిద్దార్థ్ పై నమోదైన రెండు ఫిర్యాదుల ఆధారంగా అతడికి సమన్లు పంపాను. బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ని ఆదేశిస్తూ అతడు చేసిన ట్వీట్ పై సిద్దార్థ్ వాంగ్మూలం రికార్డ్ చేస్తాము. సిద్దార్థ్ చేసిన ట్వీట్ పై ఒక కేసు నమోదు కాగా.. మరొకటి ఆమె తరఫునుంచి పరువు నష్టం దావా కేసు నమోదైంది అని చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ తెలిపారు. 

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో సిద్ధార్థ్ వాంగ్మూలం ఎలా రికార్డ్ చేయాలి అని ఆలోచిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఏది ఏమైనా అతి త్వరలో సిద్దార్థ్ సైనా నెహ్వాల్ పై చేసిన వ్యాఖ్యలకు గాను పోలీసులకు వివరణ ఇవ్వాల్సి ఉంది. 

ఇటీవల ప్రధాని మోడీ పంజాబ్ పర్యటించినప్పుడు.. నిరసన కారుల ఆందోళన నేపథ్యంలో మోడీ కాన్వాయ్ 20 నిమిషాల పాటు ఓ ఫ్లై ఓవర్ పై నిలిచిపోవాల్సి వచ్చింది. దేశ ప్రధాని పర్యటిస్తున్న చోట సెక్యూరిటీ లోపాలు తలెత్తడం ఏంటి అంటూ పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు మొదలయ్యాయి. ఈ సంఘటనపై చాలా మంది సెలబ్రిటీలు కూడా స్పందించారు. 

బ్యాట్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కూడా ఈ చర్యని ఖండించిది. దేశ ప్రధానికి సెక్యూరిటీ లేని ఏ దేశం కూడా సేఫ్ అని చెప్పలేం.ప్రధాని మోడీ పర్యటించినప్పుడు నిరసన చర్యలని, భద్రత లోపాల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సైనా నెహ్వాల్ ట్విట్టర్ లో పేర్కొంది. సైనా ట్వీట్ పై స్పందిస్తూ సిద్ధార్థ్ డబుల్ మీనింగ్ తో కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ ఇప్పుడు ఇంత పెద్ద వివాదంగా మారాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios