బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో అనేక ట్విస్ట్ లు, టర్న్‌లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన మరణం పెద్ద సస్పెన్స్ గా మారింది. మొదట పోలీసులు సుశాంత్‌ ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. కానీ ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటే, దాని లక్షణాలు కనిపించడం లేదనే వాదన వినిపిస్తుంది. ఓ డాక్టర్‌ ఆయన తలపై గాయాలున్నాయని తెలిపారు. హత్య జరిగిందనే అనుమానాలను వ్యక్తం చేశారు. 

మరోవైపు బీజేపీ నాయకులు సుశాంత్‌ని హత్య చేశారంటూ ఆరోపణలు చేశారు. మరోవైపు సుశాంత్‌ ప్రియురాలు రియా సుశాంత్‌ మరణంలో ప్రధాన ముద్దాయిగా ఆరోపిస్తున్నారు. సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఇదే విషయాన్ని ఆరోపిస్తున్నారు. మనీ గోల్‌మాల్‌కి సంబంధించి ఆమెనే ప్రధాన నింధితురాలు అని ఆరోపిస్తూ కేసు పెట్టారు. దీంతో ఈడీ ఇప్పటికే సుశాంత్‌ అకౌంట్‌ లావాదేవీలపై విచారణ చేపడుతున్నారు. 

మరోవైపు సుశాంత్‌ కేసు సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సుశాంత్‌ వంట మనిషి నీరజ్‌ స్పందించాడు. సుశాంత్‌ని ఎవరూ హత్య చేయలేదని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, సుశాంత్‌ది హత్య కాదు, ఆత్మహత్య అని వెల్లడించాడు. తాను కింద ఉన్నప్పుడు సుశాంత్‌ గదికి గడియ పెట్టకున్నాడని, కానీ సాధారణంగా ఆయనకు గడియ పెట్టుకునే అలవాటే లేదని, ఓ ఐదు నిమిషాల తర్వాత తాను సుశాంత్‌ గది దగ్గరకు వెళ్లి `ఏం వండమంటారు` అని అడిగానని, కానీ ఆయన్నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. 

సుశాంత్‌పై హత్య జరిగి ఉంటే ఎవరైనా వచ్చిపోవడాన్ని తాను చూసేవాడినని, ఆయన్ని చంపకుండా అడ్డుకునే వాడినని చెప్పాడు. ఆయన గది బెల్‌ కొట్టినా తలుపు తీయకపోతే పడుకున్నాడేమో అని డిస్టర్బ్ చేయలేదు. ఆ తర్వాత ఎంత సేపటికి సమాధానం లేకపోవడంతో అనుమానం వచ్చిందని, వెంటనే తాను, సిద్ధార్థ్ పితానీ, దీపేశ్‌ గది కలిసి తలుపు బద్దలు కొట్టి లోనికి వెళ్ళామని చెప్పాడు. అంతలోనే ఘోరం జరిగింది. అక్కడున్న దృశ్యం చూసి షాక్‌కి గురయ్యామన్నాడు. సుశాంత్‌ ఫ్యాన్స్ కి ఉరేసుకుని విగతజీవిగా కనిపించారని అన్నాడు. 

సుశాంత్‌ జూన్‌ 14న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్యకు కారణాలేంటనేది తెలియరాలేదు. దీనిపై ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది.