Asianet News TeluguAsianet News Telugu

కంగనా రనౌత్‌పై కాపీరైట్‌ ఉల్లంఘన కేసు నమోదు..జాతిపితపై అనుచిత వ్యాఖ్యలు

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌పై మోసం, కాపీరైట్‌ ఉల్లంఘన కేసు నమోదైంది. `దిద్దాః ది వారియర్‌ క్వీన్‌ ఆఫ్‌ కాశ్మీర్‌` రచయిత ఆశిష్‌ కౌల్‌ ఆమెపై కాపీరైట్‌ ఉల్లంఘన కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబయిలోని స్థానిక కోర్ట్ ని ఆయన ఆశ్రయించగా, కోర్ట్ ఆదేశాల మేరకు ముంబయి పోలీసులు శుక్రవారం ఈ కేసు నమోదు చేశారు.

cheating case filled against kangana ranaut and she fire on gandhiji  arj
Author
Hyderabad, First Published Mar 13, 2021, 9:20 AM IST

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌పై మోసం, కాపీరైట్‌ ఉల్లంఘన కేసు నమోదైంది. `దిద్దాః ది వారియర్‌ క్వీన్‌ ఆఫ్‌ కాశ్మీర్‌` రచయిత ఆశిష్‌ కౌల్‌ ఆమెపై కాపీరైట్‌ ఉల్లంఘన కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబయిలోని స్థానిక కోర్ట్ ని ఆయన ఆశ్రయించగా, కోర్ట్ ఆదేశాల మేరకు ముంబయి పోలీసులు శుక్రవారం ఈ కేసు నమోదు చేశారు. ఇందులో కంగనా రనౌత్‌, కమల్‌ కుమార్‌ జైన్‌, రంగోలి చందేల్‌, అక్షత్‌ రనౌత్‌లపై ఖార్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫస్ట్ ఇన్ఫమేషన్‌ రిపోర్ట్ కింద కేసు నమోదు చేశారు. 

`కాశ్మీర్‌ కి యోదా రాణి దిద్దా` అనే పుస్తకాన్ని ఆశిష్‌ కౌల్‌ హిందీలోకి అనువదించారు. దిద్దా, ప్రిన్స్ ఆఫ్‌ లహోర్‌(పూంచ్‌) జీవిత కథకి సంబంధించిన ప్రత్యేకమైన కాపీరైట్లు తన వద్ద ఉన్నాయని ఆశిష్‌ కౌల్‌   ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా ఈ పుస్తకం ఆధారంగా సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, తన కథని కాపీ కొడుతున్నారని ఆయన వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో కంగనాతోపాటు ఆమె టీమ్‌పై బాంద్రా మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు ఐపీసీ సెక్షన్‌ 405(క్రిమినల్‌ ట్రస్ట్ ఉల్లంఘన), 415(మోసం), 120బి(క్రిమినల్‌ కుట్ర) కింద కూడా కాపీరైట్‌ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయబడిందని పోలీస్‌ అధికారి వెల్లడించారు. 

దీంతోపాటు తన నోటి దురుసుతో మరోసారి చిక్కుల్లో ఇరుక్కుంది కంగనా. ఆ మధ్య  వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. రైతుల నిరసనను వ్యతిరేకిస్తూ కంగనా చేసిన ట్వీట్లు వివాస్పదం కావడంతో ఆమెపై కేసు కూడా నమోదైంది. దీనిపై ఆమె కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది.  తాజాగా జాతిపితను టార్గెట్‌ చేసింది. మహాత్మాగాంధీని విమర్శిస్తూ ట్విటర్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. గాంధీ తన భార్య, బిడ్డలను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయంటూ శుక్రవారం ట్వీట్‌ చేసింది.

 `జాతిపిత తన సొంత బిడ్డలను వేధించి చెడ్డ తండ్రిగా పేరుతెచ్చుకున్నారు. తన భార్య అతిధుల మరుగుదొడ్లు శుభ్రం చేయలేదని ఆమెను ఇంటి నుంచి బయటకు నెట్టివేసినట్లు పలు ప్రస్తావనలు ఉన్నాయి. అయినప్పటికి గాంధీజీ జాతిపిత అయ్యారు. ఆయన మంచి భర్త, తండ్రి కాకపోయిన ఒక గొప్ప నాయకుడు అయ్యారు. అది కేవలం పురుషాధిక్యత వల్లే సాధ్యమైంది` అంటూ కంగనా ట్విటర్‌లో రాసుకొచ్చింది. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. నెటిజన్లు ఆమెపై విమర్శలు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios