బెల్లంకొండ హీరో శ్రీనివాస్ తెలుగులో ఎన్ని చిత్రాలు చేసినా ఒక్క పెద్ద విజయం కూడా దక్కలేదు. కానీ మాస్ హీరోగా కొంతవరకు ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సొంతం చేసుకున్నాడు.

బెల్లంకొండ హీరో శ్రీనివాస్ తెలుగులో ఎన్ని చిత్రాలు చేసినా ఒక్క పెద్ద విజయం కూడా దక్కలేదు. కానీ మాస్ హీరోగా కొంతవరకు ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సొంతం చేసుకున్నాడు. కానీ ఎవరూ ఊహించని విధంగా బెల్లకొండ శ్రీనివాస్ ప్రభాస్ ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. 

అందుకు తగ్గట్లుగా వివి వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి హిందీ రీమేక్ తెరకెక్కింది. రాజమౌళి క్రేజ్ ని ఉపయోగించుకుని హిందీలో పాపులారిటీ కొట్టేయాలని చేసిన బెల్లకొండ శ్రీనివాస్ ప్రయత్నాలు పూర్తిగా బెడిసి కొట్టాయి. శుక్రవారం హిందీలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి నార్త్ ఆడియన్స్ మామూలు షాక్ ఇవ్వలేదు. 

ఈ చిత్రానికి హిందీ బెల్ట్ లో జీరో షేర్ నమోదైనట్లు తెలుస్తోంది. అంటే హిందీ ఆడియన్స్ ఛత్రపతి చిత్రాన్ని ఎంతలా రిజెక్ట్ చేశారో అర్థం అవుతోంది. ఎంత రాజమౌళి చిత్రం అయినప్పటికీ.. బెల్లంకొండ శ్రీనివాస్ తీసుకున్నది సమయానికి తగ్గ నిర్ణయం కాదని సినీ విశ్లేషకులు ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. 

ఛత్రపతి చిత్రం దాదాపు 18 ఏళ్ళ క్రితం సూపర్ హిట్.. ఆ కథతో ఇప్పుడు సినిమా తీస్తే అవుట్ డేటెడ్ కథ కాక ఇంకేమవుతుంది. ఛత్రపతి చిత్రం ఒక టిపికల్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఆ కథకి ఎన్ని హంగులు జోడించినా ఫలితం ఉండదని అర్థం అయింది. ఇటీవల రీమేక్ చిత్రాలని ఆడియన్స్ పూర్తిగా రిజెక్ట్ చేస్తున్నారు. 

ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ని హిందీలో రిలీజ్ చేసిన పెన్ స్టూడియోస్ సంస్థ రిలీజ్ చేసింది. ఈ చిత్ర నిర్మాణంలో బెల్లంకొండ సురేష్ ఎంత పెట్టుబడి పెట్టారో తెలియదు. మొత్తంగా ఛత్రపతి హిందీ రీమేక్ ఒక కాస్ట్లీ మిస్టేక్ గా మిగిలిపోయింది.