వివాదం :హోటల్ లో ఇలా చిందులేసిన చార్మి 

సినిమా ఇండస్ట్రీకు సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా అది హాట్ టాపిక్ గా మారుతుంటుంది. అందుకే తన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. తమ వ్యక్తిగత విషయాలను మీడియాకు దూరంగా ఉంచాలనుకున్నా.. ఒక్కోసారి అవి బయటపడుతూనే ఉంటాయి. తాజాగా చార్మి తాగి హోటల్ సిబ్బందిని ఇబ్బంది పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన హాట్ గ్లామర్ అవతారంతో యువతను ఉర్రూతలూగించిన ఈ బ్యూటీ.. ఆ తరువాత సెలెక్టెడ్ సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం నటిగా సినిమాలు చేయడం తగ్గించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బంజారాహిల్స్ లో ఓ స్టార్ హోటల్ లో ఉంటోన్న ఈ భామ సీనియర్ హీరో ఇచ్చిన ఒక పార్టీకు వెళ్లి మద్యం సేవించిందట. అయితే అక్కడ కూడా తనకు మందు కావాలని హోటల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేసిందట. బార్ కౌంటర్ క్లోజ్ అయిందని చెప్పినా ఆమె వినలేదని సమాచారం. తను చెప్పింది చేయలేదని మేనేజర్ ను నోటికొచ్చినట్లు తిట్టినట్టు ఫిలిం నగర్ లో గుసగుసలు.ఆమెను కంట్రోల్ చేయడానికి హోటల్ సిబ్బందికి మూడు గంటలు పైనే పట్టిందని తెలుస్తోంది.

Scroll to load tweet…