టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఛార్మి కొంతకాలానికి నటనకు దూరమైంది. అయినప్పటికీ సినిమా ఇండస్ట్రీని మాత్రం విడిచిపెట్టలేదు. నిర్మాతగా మారి దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు తీస్తోంది. 

మే 17న పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ బ్యూటీ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బిజీగా ఉన్నట్లు చెబుతోంది. ఈ సందర్భంలో దర్శకుడు పూరి జగన్నాథ్ అంటే తనకు ఎంత ఇష్టమో తెలిపింది. పుట్టినరోజు సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు పూరి జగన్నాథ్ తనకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చింది.

ఇస్మార్ట్ శంకర్ టీజర్ కి ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని.. యూనిట్ అంతా సంతోషంగా ఉందని తెలిపింది. తను పూరికి పెద్ద అభిమానినని.. అభిమానమే కాకుండా ఆయనంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది.

''ఆయనంటే ఎంతిష్టమంటే.. పూరి డైరెక్ట్ చేసిన 'పోకిరి', నేను నటించిన 'పౌర్ణమి' సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. అంతేకాదు పక్కపక్కన థియేటర్లలో ఆడుతుంటే.. 'పౌర్ణమి' సినిమా చూడకుండా 'పోకిరి' సినిమా చూశా.. ఆయనంటే అంతిష్టం'' అంటూ వెల్లడించింది.