లాక్ డౌన్ తరువాత చరణ్ పెద్దగా కనిపించడం లేదు. లాక్ డౌన్ మొదలైన నాలుగు నెలలు దాటిపోగా ముఖ్యమైన సందర్భాలలో మాత్రమే బయట కనిపిస్తున్నారు. నిన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  చరణ్ ఫ్లాగ్ హూస్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే చాలా కాలం తరువాత ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ సంధర్భంగా చరణ్ సహచరి ఉపాసన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కోవిడ్ కారణంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ నిరంతరం శ్రమించాల్సి వస్తుంది. వైద్య సిబ్బంది కరోనా రోగుల సేవలో గంటల తరబడి ఉండాల్సి పరిస్థితి. ఈ సమయంలో అపోలో హాస్పిటల్స్ చైర్ పర్సన్ గా ఉన్న ఉపాసన చాలా బిజీ అయిపోయారట. 

లాక్ డౌన్ సమయంలో ఓ 40రోజులు చరణ్ ఒంటరిగా కొరెంటైన్ అయ్యారట. ఉపాసన తన ఆసుపత్రి పనుల్లో బిజీగా ఉండడం వలన ఒకే ఇంట్లో ఉంటూ కూడా కలవలేని పరిస్థితి ఏర్పడిందట. కేవలం భోజనం సమయంలో మాత్రమే నేను, ఉపాసన కలిసేవాళ్ళం అని చరణ్ చెప్పుకొచ్చారు. ఇంటి నుండే హాస్పిటల్ వర్క్ చేసిన ఉపాసన చాలా బిజీగా గడిపారట. ఇక ఉపాసన దొరకడం నా అదృష్టం అన్న చరణ్ ఆమెతో నా జీవితం చాలా హ్యాపీగా సాగిపోతుంది అన్నారు. అపోలో చైర్ పర్సన్ గా ఉన్న ఉపాసన, బి  పాజిటివ్ అనే ఓ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కూడా నడుపుతుంది. 

ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ మూవీలో అల్లూరి పాత్ర చేస్తున్న చరణ్, తన నెక్స్ట్ మూవీ ప్రకటించాల్సి ఉంది. రాజమౌళి అల్లూరి సీతారామ రాజుగా సరికొత్తగా తనను ప్రెజెంట్ చేయనున్నట్లు చరణ్ తెలియజేయారు. చరణ్ బర్త్ డే కానుకగా విడుదలైన ఫస్ట్ లుక్ వీడియోకి విశేష స్పందన దక్కింది. ముఖ్యంగా చరణ్ లుక్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఇక చరణ్ నెక్స్ట్ కొరటాల  శివతో  మూవీ చేస్తున్నారని ప్రచారం జరుగగా, ఆయన బన్నీతో మూవీ ప్రకటించడంతో ఆ పుకార్లకు బ్రేక్ పడింది. ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ ఎవరితో చేయనున్నారనే ఆసక్తి కొనసాగుతుంది.