తనకు విషెష్ తెలిపిన ప్రతి ఒక్కరికి రామ్ చరణ్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, సల్మాన్ వంటి ప్రముఖ స్టార్స్ చరణ్ కి బర్త్ డే విషెష్ తెలుపగా వారందరికీ  వరుసగా కృతజ్ఞతలు తెలిపారు. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు నిన్న ఘనంగా ముగిశాయి. సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ ఫ్యాన్స్, సినీప్రముఖులు బెస్ట్ విషెష్ తెలియజేశారు. తనకు విషెష్ తెలిపిన ప్రతి ఒక్కరికి రామ్ చరణ్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, సల్మాన్ వంటి ప్రముఖ స్టార్స్ చరణ్ కి బర్త్ డే విషెష్ తెలుపగా వారందరికీ వరుసగా కృతజ్ఞతలు తెలిపారు. 

Scroll to load tweet…


ఎన్టీఆర్ రామ్ చరణ్ కి ప్రత్యేకంగా బర్త్ డే విషెష్ చెప్పారు. ప్రతి క్షణం నీ స్నేహంలో గొప్ప అనుభూతిని పొందాను బ్రథర్ అంటూ ట్వీట్ చేయగా, దానికి రామ్ చరణ్ ప్రతిగా... ఐ లవ్ యూ తారక్ అంటూ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…


అలాగే బెస్ట్ విషెష్ తెలిపిన మహేష్ కి థాంక్ యూ బ్రదర్ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఇక అల్లు అర్జున్ కి కూడా థాంక్ యూ బ్రదర్ అంటూ ధన్యవాదాలు తెలిపారు చరణ్. ఆర్ ఆర్ ఆర్ టీమ్ చరణ్ బర్త్ డే వేడుకలు సెట్స్ లో భారీగా నిర్వహించారు. 

Scroll to load tweet…


కాగా చరణ్ బర్త్ డే పురస్కరించుకొని ఆర్ ఆర్ ఆర్ నుండి అల్లూరి సీతారామరాజుగా ఆయన లుక్ విడుదల చేశారు. అలాగే కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య మూవీలోని సిద్ధ రోల్ లుక్ కూడా రివీల్ చేయడం విశేషం.