మెగాస్టార్ చిరంజీవి తనయుడిపై మరోసారి తన ప్రేమను చాటుకున్నారు.సైరా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల కోడలు ఉపాసనకు ఇచ్చిన ఇంటర్వ్యూలో   రామ్ చరణ్ సామర్ధ్యాన్ని గురించి వివరించాడు. అలాగే తన నలభై ఏళ్ళ సినీ కెరీర్ లో చరణ్ వల్ల ఒక కోరిక కూడా తీరిందని చెప్పారు. 

మెగాస్టార్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ ని చూసి నేను చాలా గర్వపడుతున్నా. ఎవరైనా మీకు సంతృప్తి కలిగించిన విషయం ఏమిటని అడిగితే. ఏ మాత్రం ఆలోచించకుండా చరణ్ అని చెబుతాను. చరణ్ కు ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నా. ఇన్నేళ్ల కెరేరి లో 150 సినిమాలు చేసిన నేను మహాధీర - రంగస్థలం వంటి సినిమాల్లో నటించలేదు.  ఒకవేళ రంగస్థలం లాంటి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఆ సినిమా చేయడానికి ఒప్పుకునేవాడిని కాను. 

కానీ రామ్ చరణ్ ఆ సినిమాలో అద్భుతంగా నటించి నటుడిగా బెస్ట్ పెర్ఫెమెన్స్ ఇచ్చాడు. ఇక సైరా సినిమా ఇంత అద్భుతంగా రావడానికి చరణ్ ముఖ్య కారణం. ఇలాంటి సినిమాల్లో నటించాలనుకున్న నా కోరికను చరణ్ తీర్చాడు. అందుకు చాలా సంతోషపడుతున్నట్లు మెగాస్టార్ తెలియజేశారు.