Asianet News TeluguAsianet News Telugu

చంద్రోదయం ఫస్ట్ లుక్: చంద్రన్న గెటప్ ఇలా ట్రై చేశారు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటే పాలిటికల్ లీడర్ల బయోపిక్ లు కూడా ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఓ వైపు వైఎస్ యాత్రతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ లు ఒకేసారి రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు బయోపిక్ కూడా పోటీకి వచ్చినట్లు తెలుస్తోంది. 

chandrodayam first look
Author
Hyderabad, First Published Sep 24, 2018, 7:05 PM IST

టాలీవుడ్ లో గతంలో ఎప్పుడు లేని విధంగా వరుసగా బయోపిక్ లు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటే పాలిటికల్ లీడర్ల బయోపిక్ లు కూడా ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఓ వైపు వైఎస్ యాత్రతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ లు ఒకేసారి రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు బయోపిక్ కూడా పోటీకి వచ్చినట్లు తెలుస్తోంది. 

చంద్రోదయం టైటిల్ తో వస్తున్న ఆ సినిమా ఫస్ట్ లుక్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. వినోద్ నువ్వుల చంద్రబాబు పాత్రలో నటిస్తున్నాడు. చంద్రబాబు డ్రెస్సింగ్ స్టైల్ గెడ్డం స్టైల్ బాగానే ట్రై చేశారు. ఇక ఆయన ఐకానిక్ అభివాదం కూడా బాగానే ఉంది కానీ సోషల్ మీడియాలో ఈ  ఫస్ట్ లుక్ పై భిన్న అభిప్రాయాలూ వెలువడుతున్నాయి. వెంకటరమణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రాజేందర్ నిర్మిస్తున్నారు. 

రాజ్ కిరణ్ సంగీతం అందిస్తున్న చంద్రోదయం సినిమా ఇప్పటికే ఎండింగ్ కు వచ్చేసింది. అక్టోబర్ లో రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా చెప్పేశారు. చంద్రబాబు చిన్ననాటి జీవితం నుంచి రాజకీయాల్లోకి ఆయన ఎలా ఎదిగారు అనే అంశాలను సినిమాలో చూపించనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల వివరణ ఇచ్చింది. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios