Asianet News TeluguAsianet News Telugu

Chandramukhi 2 : మరింత థ్రిల్లింగ్ గా.. ‘చంద్రముఖి2’ సెకండ్ ట్రైలర్.. రేపే ప్రీరిలీజ్ ఈవెంట్

‘చంద్రముఖి2’ (Chandramukhi 2) మరో ఐదురోజుల్లో థియేటర్లోకి రానుంది. ప్రమోషన్స్ ను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండగా.. మరింత థ్రిల్లింగ్ అంశాలతో సెకండ్ ట్రైలర్ ను విడుదల చేశారు. 
 

Chandramukhi 2 new Thrilling Release Trailer Out now NSK
Author
First Published Sep 23, 2023, 8:56 PM IST

స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence హీరోగా.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ (Kangana Ranaut) టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘చంద్రముఖి 2’. హారర్ కామెడీ ఫిల్మ్ గా  పీ. వాసు దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఇప్పటికే సెప్టెంబర్ 15న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. ఇదే నెలలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మరో ఐదురోజుల్లో రాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా సెకండ్ ట్రైలర్ ను విడుదల చేశారు. 

ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ ట్రైలర్ సినిమాపై మంచి హైప్ ను పెంచింది. థ్రిల్లింగ్ అంశాలు, భయపెట్టే సీన్స్  ఆడియెన్స్ కు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలో తాజాగా Chandramukhi2 Release Trailer  ను విడుదల చేసింది టీమ్. మరిన్ని థ్రిల్లింగ్ అంశాలతో రెండో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. గ్రాండ్ విజువల్స్, బీజీఎం అదిరిపోయింది. కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు రాఘవ లారెన్స్ యాక్షన్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉండబోతుందని ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. ‘చంద్రముఖి’ కథలానే అనిపించినా.. గ్రాండియర్ గా ఉంది.   సినిమా థ్రిల్ చేస్తుందనే నమ్మకం కలిగించేలా ఉంది. 

ఇక ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 2 గంటల 50 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించనుంది. సెప్టెంబర్ 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. 17 ఏళ్ల తర్వాత రజనీకాంత్ ‘చంద్రముఖి’కి ఇది సీక్వెల్ గా వస్తున్న విషయం తెలిసిందే. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తున్నారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసునే తెర‌కెక్కిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’  చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఉప్పుటూరి, వెంక‌ట ర‌త్నం శాఖ‌మూరి రిలీజ్ చేస్తున్నారు. ఉంటే.. రేపు హైదరాబాద్ లోనే ‘చంద్రముఖి2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించనున్నారు. తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios