ఎట్టకేటకుషూటింగ్ పూర్తి చేసుకుంది చంద్రముఖి2 సినిమా. ఇక రిలీజ్ కోసం ముస్తాబు అవుతోంది. ఇక చంద్రముఖిని ఎప్పుడు థియేటర్లలోకి తీసుకురాబోతున్నారంటే..? 

దాదాపు రిలీజ్ అయ్యి 17  ఏళ్ళ తరువాత సీక్వెల్ కు రెడీ అయ్యింది చంద్రముఖి సినిమా. ఇంతవరకూ ఈసినిమాకు సీక్వెల్ రాకపోవడమంటే విచిత్రం అనే చెప్పాలి. ఇంత లేట్ గా సీక్వెల్ అవుతున్న చంద్రముఖి సినిమాపై ఎలాంటి అంచనాలు ఉండాలి. సరిగ్గా అందరూ ఊహించిన విధంగానే భారీ అంచనాల నడుమ చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రూపొందుతుంది. కాకపోతే రజనీకాంత్, నయనతార లేకుండా.. ఆ ప్లేస్ లో.. రాఘవా లారెన్స్.. చంద్రముఖిగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ కంగనా రనౌత్ నటించారు. 

2005లో వచ్చిన చంద్రముఖి  సినిమా తమిళ,తెలుగు బాక్సాఫీస్‌ ల దగ్గర సంచలన విజయం సాధించింది. ఒక రకంగా చెప్పాలి అంటే... సౌత్ ఆడియన్స్ కు ఓ డిఫరెంట్ హర్రర్ థ్రిల్లింగ్  ఎక్స్‌పీరియెన్స్‌ ను అందించింది అని చెప్పాలి. . అంతేకాకుండా హార్రర్‌ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. కాగా దాదాపు 17ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కుతుంది. లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను చంద్రముఖి ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేసిన పి. వాసు నే  దర్శకత్వం వహిస్తున్నాడు. 

నిజానికి చంద్ర‌ముఖి విజ‌యం త‌ర్వాత ర‌జినీతోనే సీక్వెల్‌ను ప‌ట్టాలెక్కించాల‌ని ద‌ర్శ‌కుడు p.వాసు ఎంతో ప్ర‌య‌త్నించాడు. కానీ అది కుద‌ర‌లేదు.ఇక ఈమూవీ గురించి చాలా రోజులుగా రకరకాల వర్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు షూటింగ్ అప్ డేట్ వస్తూనే ఉంది. ఇక తాజాగా చంద్రముఖి2కు సబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.  తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకుంది.ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయినట్లు మూవీ టీమ్ వెల్లడించింది. అంతే కాదు రిలీజ్ కూడా దాదాపు కన్ ఫార్మ్ అయినట్టే తెలుస్తోంది. ఈ సినిమాను  వినాయక చివితి సందర్భంగా సెప్టెంబర్‌ లో రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. 

ఇక ఈసినిమాకు ప్రత్యేక ఆకర్షణ చంద్రముఖి పాత్రలోకనిపించబోయే బాలీవుడ్ బ్యూటీ కంగానా రనౌత్‌ అని చెప్పాలి. ఇక ఈసినిమాలో రాధికా శరత్‌కుమర్‌, వడివేలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎమ్‌.ఎమ్ కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్‌ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే చంద్రమఖి2 నుంచి  విడుద‌లైన పోస్టర్లు సినిమాపై విప‌రీత‌మైన క్యూరియాసిటీని పెంచాయి.