ప్రముఖ సినీనటుడు, మాజీ ఎంపీ మురళి మోహన్ కు ఇటీవల వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగింది. దీనితో మురళి మోహన్ ని పరామర్శించేందుకు ప్రముఖులంతా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. తాజాగా మాజీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ మురళి మోహన్ ని కలసి పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉందనే విషయంపై ఆరా తీశారు. 

పూర్తిగా ఆరోగ్యం కుదుటపడేవరకు విశ్రాంతి తీసుకోవాలని మురళి మోహన్ కు చంద్రబాబు సూచించారు. మురళి మోహన్ గతంలో రాజమండ్రి ప్[పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. మురళి మోహన్ ఆసుపత్రిలో ఉండగా చిరంజీవి దంపతులు వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. 

మురళి మోహన్ నటుడిగా వందలాది చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత మా అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు.