Asianet News TeluguAsianet News Telugu

సల్మాన్‌ఖాన్‌ పై ఫ్రాడ్ కేసు.. ఎందుకు పెట్టారంటే..?

సల్మాన్‌ను కలుసుకోగా, షోరూమ్ ప్రారంభించేందుకు కూడా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపాడు. కానీ ఆ తర్వాత సల్మాన్‌ రాలేదని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ మేరకు సల్మాన్‌, ఆయన సోదరి అల్విరా, సంస్థ సీఈఓ ప్రకాశ్ కాపరే సహా మరో ఏడుగురిపై కేసు నమోదైంది. 

Chandigarh Police summons Salman Khan, 7 others for inquiry jsp
Author
Hyderabad, First Published Jul 9, 2021, 8:18 AM IST

బాలీవుడ్ బాద్‌షా, కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌పై ఫ్రాడ్ కేసు నమోదయ్యింది. చంఢీగడ్‌కు చెందిన అరుణ్‌ గుప్తా అనే వ్యాపారి కంప్లైంట్ మేరకు సల్మాన్‌తో పాటు ఆయన సోదరి అల్విరా ఖాన్‌ అగ్నిహోత్రి, బీయింగ్‌ హ్యూమన్‌ ఫౌండేషన్‌కు చెందిన మరో ఏడుగురిపై కేసు నమోదు అయ్యింది. దీనిపై ఈ నెల 13వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేశారు. ఈ ఆరోపణలలో ఏదైనా నేర కోణం దాగుంటే తప్పక చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేతన్ బన్సాల్ తెలిపారు. 

 అరుణ్‌ గుప్తా ఫిర్యాదులో ఏముందంటే....సల్మాన్ ఖాన్ కు చెందిన ఇద్దరు బీయింగ్ హ్యూమన్ ఉద్యోగులు నన్ను ఆ సంస్థ ఫ్రాంచైజీని తెరవమని అడిగారు. ఇందుకు పెట్టుబడి ఖర్చు రూ.2 కోట్లు అవుతుందని చెప్పగా అందుకు అంగీకరించి అంత మోత్తాన్ని ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. కాగా షోరూమ్ తెరిచిన సంవత్సరం గడుస్తున్న, తనకు సదరు సంస్థ నుంచి బట్టలు కానీ మరొకటికానీ  ఏవీ రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట్లో ఈ విషయమై ఆ సంస్థ ఉద్యోగులు సల్మాన్ ఖాన్‌తో సమావేశం అయ్యేలా చూస్తామని చెప్పారు.

ఈ క్రమంలో అతను సల్మాన్‌ను కలుసుకోగా, షోరూమ్ ప్రారంభించేందుకు కూడా వస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపాడు. కానీ ఆ తర్వాత సల్మాన్‌ రాలేదని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఈ మేరకు సల్మాన్‌, ఆయన సోదరి అల్విరా, సంస్థ సీఈఓ ప్రకాశ్ కాపరే సహా మరో ఏడుగురిపై కేసు నమోదైంది. షోరూమ్‌ ప్రారంభించి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ నాకు ఎటువంటి సమాధానం వాళ్ల నుంచి రాలేదని ఆ ఫిర్యాదులో వాపోయాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios