పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ జీవితంపై వ్యంగ్యాస్త్రాంగా రూపొందించిన పవర్ స్టార్ సినిమా నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై సెంట్రల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read:పవర్ స్టార్ అయిపోలేదు, చెబితే గూండాగిరి చేస్తారు: వర్మ

అనుమతి లేకుండా పవర్ స్టార్ పోస్టర్లు పెట్టడంపై జరిమానా విధించింది. హైదరాబాద్ వ్యాప్తంగా 30కి పైగా పోస్టర్లను ఏర్పాటు చేయగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్, డీఆర్ఎఫ్ బృందాల తనిఖీలలో ఏ ఒక్కదానికి చిత్ర బృందం అనుమతి తీసుకోలేదని తేలింది.

Also Read:వర్మ 'ప‌వ‌ర్ స్టార్‌' మూవీ రివ్యూ!

దీంతో తమకు అందిన ఫిర్యాదుల మేరకు అనుమతి లేని పోస్టర్లకు రూ.88,000 జరిమానా విధించింది. ఈవీడీఎం డిపార్ట్‌మెంట్ నుంచి రాజీవ్ అండ్ టీం నోటీసులు అందుకున్నారు. కాగా ఇటీవలే జీహెచ్ఎంసీ కూడా పవర్ స్టార్ పోస్టర్లపై జరిమానా విధించిన సంగతి తెలిసిందే.