ఆర్జీవీకి సెన్సార్ బోర్డ్ షాక్.. ‘‘వ్యూహం’’కు సర్టిఫికెట్ ఇచ్చేది లేదన్న సీబీఎఫ్‌సీ
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న ‘వ్యూహం’ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డ్ షాకిచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. అలాగే జరుగుతున్న కాలానికి సంబంధించిన అంశాలనే కథగా తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేసింది.

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న ‘వ్యూహం’ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డ్ షాకిచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. ఈ చిత్రంలోని పాత్రలకు నిజ జీవితంలోని నేతల పేర్లను పెట్టడంపై అభ్యంతరం తెలిపింది . అలాగే జరుగుతున్న కాలానికి సంబంధించిన అంశాలనే కథగా తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ‘‘వ్యూహం’’ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ స్పందించారు. సెన్సార్ బోర్డ్ అభ్యంతరాలపై రివైజింగ్ కమిటీకి దరఖాస్తు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరుగుతోంది. ఇందులో తాను కూడా భాగం అయ్యేలా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'వ్యూహం' చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పొలిటికల్ జర్నీ ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ చిత్రాలకి వివాదాలు జోడించి ఆసక్తి పెంచడంలో వర్మ స్టయిలే వేరు.
వ్యూహం చిత్రాన్ని ఆర్జీవీ రెండు భాగాలుగా తెరెరకేక్కిస్తున్నారు. మొదటి భాగం నవంబర్ 10న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో నేడు వ్యూహం మొదటి భాగం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఊహించిన విధంగానే వర్మ వైయస్ జగన్ ని హైలైట్ చేస్తూ, వైఎస్ఆర్సీపీ కి అనుకూలంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.
పవన్ కళ్యాణ్, చంద్రబాబులని టార్గెట్ చేస్తూ వర్మ తనదైన శైలిలో సెటైరికల్ గా వారి పాత్రలని చిత్రీకరించారు. మరి చిత్రంలో ఇంకెత వివాదాస్పద అంశాలు ఉన్నాయో చూడాలి. అయితే ట్రైలర్ లాంచ్ సందర్భంగా వర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. వర్మ ఇటీవల తెరకెక్కించిన చిత్రాలు గమనిస్తే.. వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, పవర్ స్టార్, ఇప్పుడు తెరకెక్కిస్తున్న వ్యహం చిత్రాలతో సహా అన్ని పొలిటికల్ కాంట్రవర్సీ చిత్రమే.