టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. బండ్ల గణేష్ పెద్ద సోదరుడు కుమార్తె అశ్రిత వివాహం హైదరాబాద్ లోకి జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ఈరోజు జరిగింది.
ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, బ్రహ్మానందం దంపతులు, హీరో శ్రీకాంత్ దంపతులు, రాజశేఖర్ జీవిత, కొందరు హీరోలు ఈ వేడుకకు హాజరయ్యి నూతన వధూవరులకు తమ ఆశీస్సులు అందించారు. సినీ ప్రముఖులతో పాటు కొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.


