శ్రీదేవి మరణ విషాదం నుంచి కపూర్ కుటుంబమే కాదు.. అభిమానులు, సన్నిహితులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఇంతటి విషాదంలో శ్రీదేవి కూతురు జాహ్నవి జన్మదినం వచ్చేసింది. మంగళవారం జాహ్నవి కపూర్ 21 పడిలోకి ప్రవేశించింది. తల్లి లేకుండా తొలి పుట్టిన రోజును జరుపుకోవడం అనేది జాహ్నవికి మింగుడు పడని విషయమనే చెప్పవచ్చు. ఇలాంటి విషాద క్షణాల నుంచి జాహ్నవి బయటపడి మానసికంగా తాను బలవంతురాలినని ఎలా ప్రూవ్ చేసుకొంటుందో వేచి చూడాల్సిందే.జాహ్నవి బర్త్‌డే సందర్భంగా తన సోదరి సోనమ్ కపూర్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మానసిక ఒత్తిడిని ఎదిరించే ధైర్యవంతులైన అమ్మాయిల్లో జాహ్నవి ఒకరు అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.జాహ్నవి 21 ఏట అడుగుపెట్టింది.

 

నాకు తెలుసు మానసికంగా బలవంతురాలైన అమ్మాయిల్లో ఒకరైన జాహ్నవి ఈ రోజు యువతిగా మారారు. హ్యాపీ బర్త్‌డే జానూ అని సోనమ్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో జాహ్నవికి బర్త్‌డే విషెస్‌ను అందించారు. ఈ మేరకు నవ్వుతూ ఉన్న జాహ్నవి ఫోటోను షేర్ చేశారు.జాహ్నవికి జన్మదిన శుభాకాంక్షలు అందించిన వారిలో ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా ఉన్నారు. హ్యాపీ బర్త్‌డే మై డియర్ జాహ్నవి కపూర్. సంతోషాన్ని, ప్రేమను, శాంతిని, ఇంకా అన్నీ నీకు అందించాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని తన సందేశంలో పేర్కొన్నారు. సందేశంతోపాటు దడక్ షూటింగ్‌లో శ్రీదేవి, జాహ్నవితో కలిసి తీసుకొన్న ఫొటోను మనీష్ మల్హోత్రా షేర్ చేశారు.

 

తన తల్లి మరణం విషాదం నుంచి కాస్త కుదుటపడిన జాహ్నవి.. శ్రీదేవిని గుర్తుంచుకోవాలని ఆమె కోరారు. నా పుట్టిన రోజున మిమ్మల్ని నేను ఏమీ అడుగను. మీ తల్లిదండ్రులను ప్రేమించమని కోరుతాను. తల్లిదండ్రులను ప్రేమలో ముంచెత్తే విధంగా వారి పట్ల అంకితభావం ప్రదర్శించండి అని సూచించారు.అలాగే తల్లిదండ్రులకు అమితమైన ప్రేమను పంచండి. వారు మీకు అందమైన జీవితాన్ని ప్రసాదించారు. అలాగే నా తల్లిని కూడా గుర్తుంచుకోండి. ఆమె ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థించండి అని జాహ్నవి తన లేఖలో పేర్కొన్నారు.తల్లి మరణం నేపథ్యంలో జాహ్నవి రాసిన లేఖ అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. నా హృదయాన్ని ఓ శూన్యం ఆవిరించింది. ఆ శూన్యం నుంచి బయటపడి ఎలా జీవించాలో నాకు తెలుసు. ఈ శూన్యంలో కూడా నీ ప్రేమను తలచుకొంటాను. నీ ప్రేమ మాటున నీవు లేని బాధను, విషాదాన్ని దిగమింగుతాను.గత జన్మదినం రోజున జాహ్నవికి శ్రీదేవి తెలిపిన శుభాకాంక్షలు చూస్తే గుండె ద్రవించకమానదు. హ్యాపీ బర్త్ డే మై ఏంజెల్. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది నువ్వే. విష్ యూ బెస్ట్ బర్త్‌డే మై బేబీ. లవ్ యూ అని ఓ ఫోటోను శ్రీదేవి షేర్ చేశారు