Asianet News TeluguAsianet News Telugu

ఈ రోజు వజ్రాన్ని కోల్పోయింది.. ప్రణబ్‌ మృతి పట్ల సెలబ్రిటీల సంతాపం

దేశ రాజకీయాల్లో విశేష సేవలందించిన ప్రణబ్‌ ముఖర్జీ మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని చెప్పొచ్చు. ఆయన మృతి పట్ల యావత్‌ దేశం సంతాపం చెబుతోంది. అందులో భాగంగా సినీ సెలబ్రిటీలు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో సంతాపం చెబుతూ పోస్ట్ లు పెట్టారు. 

celabraties have expressed deep grief the death of former president pranab   mukharjee
Author
Hyderabad, First Published Aug 31, 2020, 8:24 PM IST

కరోనా మహమ్మారి పేద వారి నుంచి రాష్ట్రపతి స్థాయి వరకు ఎవరైనా దానికి అతీతం కావడం లేదు. ఏ స్థాయి వ్యక్తులైనా దానికి బలికాకతప్పడం లేదు. తాజాగా గత కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సోమవారం సాయంత్రం కరోనా తుదిశ్వాస విడిచారు. 

దేశ రాజకీయాల్లో విశేష సేవలందించిన ప్రణబ్‌ ముఖర్జీ మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని చెప్పొచ్చు. ఆయన మృతి పట్ల యావత్‌ దేశం సంతాపం చెబుతోంది. అందులో భాగంగా సినీ సెలబ్రిటీలు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో సంతాపం చెబుతూ పోస్ట్ లు పెట్టారు. 

చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ప్రణబ్‌ మరణం తీవ్ర మనస్తాపానికి గురిం చేసిందని, ఆయన్ని కలిసినప్పుడు ఆయన చెరిష్మా ఏంటో తెలిసిందే. ఆయన ఎంతో గొప్ప జ్ఞానం, విశిష్టమైన రాజకీయ జీవితాన్ని గడిపిన వ్యక్తి. ఈ రోజు విలువైన వజ్రాన్ని కోల్పోయిందని తెలిపారు. 

పవన్‌ కళ్యాణ్‌ స్పందిస్తూ, భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దీవంతగతులయ్యారనే వార్త తనని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత రాజకీయాల్లో తనదంటూ సొంత ముద్రని కలిగిన ప్రణబ్‌ మరణం దేశానికి తీరని లోటని తెలిపారు. 

స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో పుట్టి, రాజకీయాల్లో ప్రవేశించిన ప్రణబ్‌ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా, కేంద్ర ఆర్థిక మంత్రిగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లో ఆయనొక విలక్షణమైన ధృవతారగా వెలిగారు. ఈ దేశం కూడా పద్మవిభూషణ్‌, భారతరత్న పురస్కరాలతో ఆయన సేవలను సముచితంగా సత్కరించుకుంది. దేశ రాష్ట్రపతిగా ఎదిగినా తన మూలాలు మరిచిపోకుండా ఉన్నారు. ఆయన జీవితం,రాజకీయ ప్రస్థానం,భావిష్యత్‌ తరాలకు స్ఫూర్తి` అని పవన్‌ ప్రకటనలో పేర్కొన్నారు. 

వీరితోపాటు మహేష్‌బాబు, బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగన్‌, రితేష్‌ దేశ్‌ముఖ, రణ్‌దీప్‌ హుడా, తాప్సీ,  ఖుష్బు వంటి వారు స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios