Asianet News TeluguAsianet News Telugu

సుశాంత్ మరణంపై సీబీఐ షాకింగ్ రిపోర్ట్...నాలుగు నెలల హైడ్రామా వెనుక కారణం?

అనేక మలుపులు తిరిగిన సుశాంత్ డెత్ కేసు ఆత్మహత్యగానే ముగిసింది. సుశాంత్ పోస్టుమార్టం, అటాప్సి రిపోర్ట్ పరిశీలించిన ఎయిమ్స్ వైద్య నిపుణులు సైతం సుశాంత్ ని మర్డర్ చేశారనడానికి ఆనవాళ్లు లేవన్నారు.సీబీఐ ఫైనల్ రిపోర్ట్ లో సుశాంత్ ఆత్మ హత్య కారణంగానే మరణించినట్లు వెల్లడించారు.  కాబట్టి బిహార్ పోలీసుల నుండి, సీబీఐ, ఈడీ చేసిన ఈ హంగామా అంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనా అనిపిస్తుంది. 

cbi conforms the cause of death of sushanth singh rajput ksr
Author
Hyderabad, First Published Oct 15, 2020, 11:47 AM IST


నాలుగు నెలల హై డ్రామాకు తెరపడింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణాలేమిటో సీబీఐ వెల్లడించింది. దీనిపై సమగ్ర నివేదిక త్వరలో వెల్లడించనుంది. సీబీఐ విచారణ ప్రకారం సుశాంత్ మరణం ఆత్మహత్య వలనే సంభవించింది. ఆయన హత్యకు గురికాలేదు. మానసిక వేదనతో ఆత్మ హత్య చేసుకున్నారని తేల్చారు. ఐతే మరి నాలుగు నెలల హై డ్రామా వెనుక కారణం ఏమిటనేది అర్థం కావడం లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలే నిజమయ్యాయని అనిపిస్తుంది. 

జూన్ 14వ తేదీ ఆదివారం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబైలోని తన నివాసంలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాడీని ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం సుశాంత్ ది ఆత్మ హత్యే అని నిర్ధారించడం జరిగింది. అనంతరం సుశాంత్ మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, వారు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 

ఐతే సుశాంత్ తండ్రి కేకే సింగ్ బీహార్ లో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై కేసు పెట్టడంతో ఈ వ్యవహారం పెద్దదైంది. ఆర్థికంగా సుశాంత్ ని దోచుకున్న రియా చక్రవర్తి తన కొడుకు మరణానికి కారణం అయ్యిందని పిర్యాదు చేశారు. బీహార్ పోలీసులు ముంబై వచ్చిన అనేక కోణాల్లో విచారణ చేశారు. సుశాంత్ మితృలు మరియు సిబ్బందిని విచారించడం జరిగింది. సుశాంత్ బ్యాంకు అకౌంట్స్ ని కూడా పరిశీలించారు. 

సుశాంత్ కుటుంబ సభ్యులు, బీహార్ ప్రభుత్వ డిమాండ్  మేరకు కేంద్రం సీబీఐకి సుశాంత్ కేసు అప్పగించింది.  సీబీఐ తో పాటు, ఈడీ కూడా ఈ కేసులోకి ఎంటర్ కావడం జరిగింది.రియాను మరియు కుటుంబ సభ్యులను సీబీఐ విచారించింది. అలాగే ఆమె ఈడీ ఎదుట హాజరు కావడం జరిగింది. ఐతే సుశాంత్ ఖాతాల నుండి పెద్ద మొత్తంలో రియా ఖాతాలకు  ట్రాన్స్ఫర్ అయ్యిందన్న ఆధారాలు లభించలేదు. 

ఐతే సుశాంత్ కి డ్రగ్స్ అలవాటు ఉందని, రియా, షోవిక్ మరియు శామ్యూల్ మిరాండా కలిసి డ్రగ్స్ సేవించే వారని సుశాంత్ ఇంటిలో పనిచేసేవారు చెప్పడంతో ఈ కేసు కొత్త మలుపుతీసుకుంది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎంట్రీతో సుశాంత్ డెత్ కేసు కాస్తా డ్రగ్స్ కేసుగా మారింది. డ్రగ్స్ ఆరోపణలపై రియా మరియు ఆమె తమ్ముడు షోవిక్ లను అరెస్ట్ చేశారు. ఆ తరువాత దీపికా, రకుల్, శ్రద్దా కపూర్ మరియు సారా అలీ ఖాన్ లపై ఆరోపణలు రావడంతో పాటు విచారణ ఎదుర్కొన్నారు. 

ఇన్ని మలుపులు తిరిగిన సుశాంత్ డెత్ కేసు ఆత్మహత్యగానే ముగిసింది. సుశాంత్ పోస్టుమార్టం, అటాప్సి రిపోర్ట్ పరిశీలించిన ఎయిమ్స్ వైద్య నిపుణులు సైతం సుశాంత్ ని మర్డర్ చేశారనడానికి ఆనవాళ్లు లేవన్నారు.సీబీఐ ఫైనల్ రిపోర్ట్ లో సుశాంత్ ఆత్మ హత్య కారణంగానే మరణించినట్లు వెల్లడించారు.  కాబట్టి బిహార్ పోలీసుల నుండి, సీబీఐ, ఈడీ చేసిన ఈ హంగామా అంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనా అనిపిస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios