సుశాంత్ డెత్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న సీబీఐ అనేక కోణాలలో విచారణ సాగిస్తుంది. సుశాంత్ గతానికి సంబందించిన ప్రతి విషయం వెలికి తీస్తున్నారు. కాగా సుశాంత్ మరియు రియా మధ్య జరిగిన ఫోన్ సంభాషణలకు సంబంధించిన కొన్ని ఆడియో టేపులు సీబీఐ సేకరించడం జరిగింది. ఈ ఆడియో టేపులలో ఉన్న వాయిస్ సుశాంత్ దే అని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించడం జరిగింది. ఇక ఈ ఫోన్ సంభాషణలో సుశాంత్ తన మనసు ఏమి బాగోలేదని, కొన్నాళ్ళు ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని ఉందని చెప్పారట. అలాగే ఈ సమయంలో డబ్బులు ఆదా చేయడం అవసరం అన్నారట. 

ఆ ఫోన్ సంభాషణల ప్రకారం సుశాంత్ తో రియా ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడినట్లు తెలుస్తుంది. తాజా టేపుల ద్వారా సుశాంత్ నిజంగానే డిప్రెషన్ తో బాధపడుతున్నారా  అనే అనుమానం బలపడుతుంది.  మానసికంగా ఆరోగ్యంగా లేనట్లు ఆయన మాటలు ఉన్నాయి. ఈ కేసులో మొదటి నుండి రియా సుశాంత్ మానసిక ఆరోగ్యం సరిగా లేదని చెవుతున్న సంగతి తెలిసిందే. 

కానీ సుశాంత్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని అసలు ఒప్పుకోవడం లేదు. సుశాంత్ ఎప్పుడూ మానసిక వేదన పడ్డ ఆధారాలు లేవు అంటున్నారు. కేవలం రియా చక్రవర్తి నే సుశాంత్ మరణానికి కారణం అంటున్నారు . మరి సీబీఐ విచారణ కొనసాగుతుండగా నేడు కూడా రియా చక్రవర్తి సీబీఐ ఎదుట హాజరయ్యింది. సుశాంత్ తో ఆమెకు గల పరిచయాలతో పాటు ప్రేమ, వివాదాలు , ఆర్థిక లావాదేవీలు వంటి అనేక విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు.