సంజయ్ పురాణ్ సింగ్ తెరకెక్కించిన '72 హూరైన్' చిత్రానికి షాక్ తగిలింది. ఈ సినిమా ట్రైలర్ కు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిరాకరించింది. 


డైరక్టర్ సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ దర్శకత్వం వహించిన చిత్రం '72 హూరైన్'. ఈ సినిమాలో పవన్ మల్హోత్రా(Pawan Malhotra), అమీర్ బషీర్(Aamir Bashir) వంటి నటులు కీ రోల్ లో నటిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ మూవీ నుంచి ట్రైలర్ కు బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సెన్సార్ సర్టిఫికేట్ ఆపేసినట్లు సమాచారం. దాంతో ఈ మూవీ సహ నిర్మాత అశోక్ పండిట్(Ashoke Pandit) ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 72 హూరైన్ ట్రైలర్ రిలీజ్ ఎందుకు ఆపేశారో వివరించాలని CBFCని కోరారు. అసలు ఇంతకీ ఈ ట్రైలర్ లో ఏముంది..

 ఈ టీజర్ లో ఉగ్రవాదానికి గల కారణాలను ఎక్కువగా చూపించారంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ మూవీను ప్రధానంగా హురైన్ 72 అనే అంశం చూట్టూ సాగే కథ. 'జీహాద్ కోసం ప్రాణాలు అర్పిస్తే తర్వాత స్వర్గంలో 72 మంది కన్యలు మీకు సేవ చేస్తారు అనేదే హురైన్ 72 ఉద్దేశం' అంటూ డైలాగ్ ను ట్రైలర్ లో ప్రస్తావించారు.

View post on Instagram

 దర్శకుడు చౌహాన్ మాట్లాడుతూ.. "ఉగ్రవాదం అనేది చాలా దారుణమైన చర్య. ఉగ్రవాదం ఎప్పుడు, ఎక్కడ పుడుతుందో ఉహించలేనిది. కొంత మంది మత విద్రోగులు సాధారణ ప్రజలను ఉగ్రవాదులుగా మారుస్తున్నారని వాళ్లని బాంబర్లుగా మారుస్తున్నారని. హురైన్ 72 అనేది ఉగ్రవాదులు సామాన్యులను ఉగ్రవాదులుగా మార్చే శిక్షణలో ఎక్కువగా ఉపయోగిస్తారని, వాళ్లు చనిపోయిన తర్వాత స్వర్గంలో 72 మంది కన్యలు వారికి సేవ చేస్తారని నమ్మించి.. వారిని ఉగ్రవాదంలోకి తోస్తారని చాలా మంది మన లాంటి కుటుంబాలు వాళ్లు చేసే బ్రెయిన్ వాష్ వల్ల బాంబర్లుగా మారిపోతున్నారని, అలాంటి మూలాలనే ఈ సినిమాలో చూస్తారని దర్శకుడు చౌహాన్ ప్రకటించారు. 

 సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం '72 హూరైన్'. పవన్ మల్హోత్రా, అమీర్ బషీర్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా బృందానికి బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) షాక్ ఇచ్చింది. ఈ మూవీ ట్రైలర్ కు సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.