ప్రభాస్ పెళ్లికి కులం అడ్డం!

cast problems for prabhas marriage
Highlights

టాలీవుడ్ తో పాటు 'బాహుబలి' చిత్రంతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు 

టాలీవుడ్ తో పాటు 'బాహుబలి' చిత్రంతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ టాలీవుడ్ అనగానే గుర్తుకువచ్చే మొదటిపేరు ప్రభాస్దే.. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా.. ఇప్పటికీ ఆయన పెళ్లి మాత్రం చేసుకోలేదు. దానికి కారణం కులం అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఒప్పుకుంటే అతడ్ని పెళ్లాడడానికి చాలా మంది ముందుకు వస్తారు.

కానీ ప్రభాస్ ఇంట్లో కాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువట. క్షత్రియ వర్గానికి చెందిన ప్రభాస్ ఆ వర్గానికి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనేది పెద్దల ఆలోచన. ఈ మధ్యకాలంలో హీరోలు కుల, మతాలను అతీతంగా పెళ్లిల్లు చేసుకుంటున్నారు. ప్రభాస్ కూడా అలా చేసుకుంటాడేమో అనే ఆలోచనతో కుల సంఘానికి చెందిన పెద్దలు కృష్ణంరాజుపై ఒత్తిడి తీసుకువస్తున్నారట.ఈ కారణంగానే ప్రభాస్ తను ఇష్టపడిన ఇద్దరు హీరోయిన్లను వదులుకున్నాడని టాక్.

పోనీ వారి కులంలో అమ్మాయిలనే చూస్తుంటే సదరు అమ్మాయిలు ప్రభాస్ కు సెట్ కాకపోవడం, మరికొందరిని ప్రభాస్ రిజెక్ట్ చేయడం జరుగుతున్నాయట. ఈ ఏడాదిలోనే ప్రభాస్ కు పెళ్లి చేయాలని అనుకున్నప్పటికీ సంబంధం కుదరకపోవడంతో మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. 
 

loader