సినీ నటుడు బాలాజీ పై కేసు

case filed on tv artist balaji
Highlights

సినీ నటుడు బాలాజీ పై కేసు

టీవీ, సినీ నటుడు బాలాజీపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలాజీ తనను మోసగించాడంటూ నటి లక్ష్మి వారికి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ యూసుఫ్ గూడలో ఉంటున్న తను భర్త చనిపోయిన తరువాత కుటుంబ భారాన్ని మోస్తున్నానని, తన కుమార్తె అనారోగ్యం కారణంగా అప్పుల పాలయ్యానని ఆమె తెలిపారు.

కిడ్నీలు పాడైన బాలాజీ భార్య క్రిష్ణవేణికి కిడ్నీ ఇస్తే 20 లక్షలు ఇస్తానని బాలాజీ ఒప్పందం చేసుకున్నాడని, 2016 లో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి జరిగిందని ఆమె చెప్పారు. అయితే 20 లక్షలకు బదులు 3 లక్షలు మాత్రమే ఇచ్చి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకుని డబ్బులు ముట్టినట్టు తప్పుడు పత్రాలు సృష్టించాడని  లక్ష్మి చెప్పారు. న్యాయంకోసం తాను మనవ హక్కుల కమిషన్ కు, ‘ మా ‘ కు కూడా ఫిర్యాదు చేశానన్నారు. బాధితురాలి వెంట నటి శ్రీరెడ్డి కూడా ఉన్నారు.

loader