లేడి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో కరాటే కళ్యాణి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో జరిగే కార్యక్రమాల్లో కరాటే కళ్యాణి చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది. అలాగే టివి సీరియల్స్ లో కూడా కరాటే కళ్యాణి నటించింది.
లేడి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో కరాటే కళ్యాణి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో జరిగే కార్యక్రమాల్లో కరాటే కళ్యాణి చురుగ్గా పాల్గొంటూ ఉంటుంది. అలాగే టివి సీరియల్స్ లో కూడా కరాటే కళ్యాణి నటించింది. ఇదిలా ఉండగా కరాటే కళ్యాణి తరచుగా వివాదాల్లో చిక్కుకోవడం కూడా చూస్తూనే ఉన్నాం.
తాజాగా Karate Kalyani చిక్కుల్లో పడింది. ఆమెపై హైదరాబాద్ జగద్గిరి గుట్టలో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగరేణి కాలానికి చెందిన ఓ మైనర్ బాలిక హత్య కేసు నడుస్తోంది. ఈ కేసుకి సంబంధించిన వివరాలని కరాటే కళ్యాణి లీక్ చేసిందని,సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేసినట్లు తూటం శెట్టి నితీష్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు.
ఆయన రంగారెడ్డి జిల్లా కోర్టులో కరాటే కళ్యాణి పేరుని ప్రస్తావిస్తూ ఫిర్యాదు చేశారు. దీనితో కోర్టు జగద్గిరి గుట్ట పోలీసులకు ఆదేశాలు పంపింది. వెంటనే కరాటే కళ్యాణిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కరాటే కళ్యాణిపై కేసు నమోదైంది.
కరాటే కళ్యాణి ఈ హత్య కేసులో ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది అనే వివరాలు ఇంకా తెలియలేదు. కరాటే కాలనీ తెలుగులో 250కి పైగా చిత్రాల్లో నటించింది. ఆమె టాలీవుడ్ లో జరిగే సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అలాగే రాజకీయంగానూ చురుగ్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.
ఆ మధ్యన కరాటే కళ్యాణి బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి తీర్థం కూడా పుచ్చుకుంది. ఆ మధ్యన ముగిసిన మా ఎన్నికల్లో కళ్యాణి మంచు విష్ణు ప్యానల్ తరుపున జాయింట్ సెక్రటరీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. కరాటే కళ్యాణి బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొంది.
