కుర్చీ మడత పెట్టి అంటూ సోషల్ మీడియాని షేక్ చేసిన కుర్చీ తాత గతంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.తాజాగా మరోసారి అరెస్ట్ అయినట్లు సమాచారం అందుతుంది.
ప్రముఖ యూట్యూబర్ వైజాగ్ సత్య, స్వాతి నాయుడు తమని భూతులు తిడుతూ వీడియోలు చేస్తున్నాడు అని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో కుర్చీ తాత ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఆ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మందు పోసి తిట్ట మంటేనే తిట్టాను అంటూ కుర్చీ తాత చెప్పాడు. అనంతరం వైజాగ్ సత్యకు, స్వాతి నాయుడు లకు క్షమాపణ చెప్పి కేసు నుండి బయట పడ్డాడు.
కుర్చీ తాత అసలు పేరు షేక్ అహ్మద్ షాషా. హైదరాబాద్ లోని కృష్ణ కాంత్ పార్క్ వద్ద తిరుగుతూ ఉంటాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా రోడ్లపై తిరుగుతూ ఉంటాడు. వాళ్ళని వీళ్ళని బూతులు తిడుతున్న వీడియోలు యూట్యూబ్ ఛానల్స్ వైరల్ చేయడంతో పాపులర్ అయ్యాడు. అలా అతను ఓ సందర్భములో చెప్పిన 'కుర్చీని మడత పెట్టి ' డైలాగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
అలా చివరికి మహేష్ బాబు సినిమాలోని పాటకు ఈ డైలాగ్ ను వాడుకున్నారు. ఇందుకు గాను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కుర్చీ తాతకి ఆర్ధిక సహాయం కూడా చేశాడు. దీనికంతా కారణం యూట్యూబర్ వైజాగ్ సత్య అతని వల్లే ఫేమస్ అయిన కుర్చీ తాత .. రివర్స్ అయ్యి వైజాగ్ సత్య ని నోటికొచ్చిన బూతులు తిడుతూ రచ్చ చేస్తున్నాడు. అతనితో పాటు స్వాతి నాయుడు ని కూడా అసభ్యంగా తిడుతున్నాడట.
దీంతో స్వాతి నాయుడు, వైజాగ్ సత్య లు మంగళ వారం మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. గతంలో కూడా ఇదే విధంగా కాలా పాషా వైజాగ్ సత్య ని బూతులు తిడుతూ రచ్చ చేశాడు. ఇక ఇప్పుడు కూడా ఇలానే దుర్భాషలాడుతూ రచ్చ కెక్కాడు.