ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ రంజీత్ కౌర్ వివాదాల్లో చిక్కుకుంది. ఆమె తన భర్తను కొట్టడమే కాకుండా నాల్గవ అంతస్తు నుండి తోయడానికి ప్రయత్నించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంజీత్ కౌర్ బాలీవుడ్ లో రిషి కపూర్ సరసన నటించిన 'లైలా మజ్ను' సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

అప్పట్లో సినిమా పెద్ద సక్సెస్ అయింది. ఇది ఇలా ఉండగా.. రంజీత్ తన భర్తపై దాడి చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. తన భర్త రాజ్ సమంద్ మహారాష్ట్రలోని పూణే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆయన సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్ సాయంతో భార్యపై కంప్లైంట్ చేశారు. తన భార్య రంజీత్ కౌర్, కుమారుడు ఇద్దరూ కలిసి తనను కొడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే వారిద్దరూ తనను నాల్గవ ఫ్లోర్ నుండి తోసివేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

దీనిపై మాట్లాడిన రంజీత్ కౌర్ అందరి ఇళ్లల్లో ఉండే గొడవలేనని, తన భర్త, కుమారుడు అమెరికాలో వ్యాపారం చేస్తున్నారని, ఈ విషయంలోనే వివాదం జరిగిందని చెప్పారు. ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకొని భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.