స్టార్ హీరోపై మహిళ కేసు.. కోర్టులోనే తేల్చుకుంటానంటున్న నటుడు!

First Published 20, Jul 2018, 4:47 PM IST
case filed against ranbir kapoor
Highlights

రణబీర్ కపూర్ పై పూణే సివిల్ కోర్టులో ఓ మహిళ దావా వేసింది. ఈ మేరకు కోర్టు అతడికి  మెయిల్ ద్వారా నోటీసులు పంపింది

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ పై పూణే సివిల్ కోర్టులో ఓ మహిళ దావా వేసింది. ఈ మేరకు కోర్టు అతడికి  మెయిల్ ద్వారా నోటీసులు పంపింది. ఈ కోర్టులోనే విషయం తేల్చుకుంటానని రణబీర్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వస్తే.. కళ్యాణి నగర్ లోని ట్రంప్  టవర్ లో గల రణబీర్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న సూర్య వంశీ అనే మహిళ రణబీర్ పై 50 లక్షల రూపాయలకు దావా వేశారు.

రణబీర్ కు చెందిన ఓ అపార్ట్మెంట్ లో సూర్య వంశీ అద్దెకు ఉంటున్నారు. నెలకు 4 లక్షల రెంట్ గల ఈ అపార్ట్మెంట్ లో ఆమె 11 నెలల పాటు ఉన్నారు. ఆ తరువాత రణబీర్ వాళ్లను  ఖాళీ చేయమని చెప్పడంతో అక్కడ నుండి వెళ్లిపోయారు. కానీ అనూహ్యంగా రణబీర్ పై ఆమె దావా వేయడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. రెంటల్ అగ్రిమెంట్ నియమాలకు విరుద్ధంగా రణబీర్ తమను ఇల్లు ఖాళీ చేయించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

సడెన్ గా ఇల్లు ఖాళీ చేయమని చెప్పడంతో కుటుంబం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. 24 నెలల కాలానికి అద్దెకు ఇవ్వగా.. 11 నెలలు పూర్తయిన తరువాత ఇల్లు ఖాళీ చేయమని రణబీర్ బలవంతం చేశారని ఆమె అన్నారు. 2017 అక్టోబర్ లో పట్టుబట్టి మరీ ఇల్లు ఖారీ చేయించినట్లు సూర్యవంశీ కోర్టుకి తెలిపారు. రణబీర్ మాత్రం తాను రెంటల్ అగ్రిమెంట్ నియమాలను ఉల్లఘించలేదని, కోర్టులో దీని గురించి మాట్లాడతా అని అన్నారు. 

loader