'లైకా' ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'కత్తి', '2.0' లాంటి భారీ సినిమాలను రూపొందించిన ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రూ.186 కోట్లకు మోసం చేసినట్లు సుభాస్కరన్ పై ఆరోపణలు చేస్తున్నారు. చెన్నై పోలీస్ కమీషనర్ ని కలిసి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు బాధితులు.

బిజినెస్ మెన్ గా సక్సెస్ అయిన సుభాస్కరన్ సినిమాల మీద ఆసక్తిగా నిర్మాతగా మారి అతడి తక్కువ సమయంలో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా లైకా ప్రొడక్షన్ సంస్థకి పేరు తీసుకొచ్చాడు. ఈ బ్యానర్ లో వచ్చిన '2.0' సినిమా కోసం అతడు భారీ పెట్టుబడి పెట్టాడు.

దాదాపు 500 కోట్లకు పైగా ఈ సినిమాపై వెచ్చించాడు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి. ఇటీవల సినిమాను చైనాలో విడుదల చేశారు.

అక్కడ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో సుభాస్కరన్ కి నష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో అతడు తీసుకున్న బకాయిలు చెల్లించలేకపోయాడు. దీంతో అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.