బాలీవుడ్ నటి అమీషా పటేల్ పై చీటింగ్ కేసు నమోదైంది. నిర్మాత అజయ్ కుమార్ సింగ్.. అమీషా తనను మోసం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమీషా వ్యాపార భాగస్వామి కునాల్ పై కూడా రాంచీ కోర్టులో కేసు వేశారు.

'దేశీ మ్యాజిక్' అనే సినిమా కోసం అజయ్ వద్ద అమీషా రూ.2.5 కోట్లను అప్పుగా తీసుకున్నారట. అయితే ఆ మొత్తాన్ని ఆమె తిరిగి ఇవ్వలేదని అజయ్ పేర్కొన్నారు. అమీషా, కునాల్ గత ఏడాది మార్చిలో రాంచీ వచ్చినప్పుడు తన దగ్గర రెండున్నర కోట్లు తీసుకున్నారని, తమ సినిమా జూన్ 2018లో విడుదలవుతుదని, లాభాలు వస్తాయని చెప్పి అప్పుడు తీసుకున్నారని వెల్లడించాడు.

అయితే ఇప్పటివరకు ఆ సినిమా థియేటర్లోకి రాలేదని, అదే విషయాన్ని ప్రశ్నిస్తే మూడు కోట్ల చెక్ ఇచ్చారని కానీ అది బౌన్స్ అయినట్లు తెలిపారు. దీంతో మరోసారి వాళ్లను సంప్రదిస్తే.. డబ్బులు వెనక్కి ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పారని, ప్రముఖులతో దిగిన ఫోటోలు చూపింది అమీషా తనను బెదిరించిందని వెల్లడించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.