తమిళనాడు మిల్క్ డీలర్స్ అశోషియేషన్ వాళ్లు చెన్నై పోలీస్ స్టేషన్ లో తమిళ హీరో శింబు పై కేసు పెట్టారు. నిన్నటి రోజు శింబు తనని కామెంట్ చేసిన వారికి కౌంటర్ గా ...తన కటౌట్స్ కు పాలాభిషేకం చేయమని పిలుపు ఇచ్చారు. ఆ విషయం ప్యాన్స్ వైరల్ చేసారు. 

ఆ విషయం మిల్క్ డీలర్స్ అశోషియేషన్ కు చేరింది. ఎంతో విలువైన పాలను కౌటట్స్ పాలాభిషేకంకు వాడమంటారా అంటూ సీరియస్ అయ్యారు. అలాంటి ఏక్టివిటీస్ ని ఎంకరేజ్ చేయమని క్లియర్ గా చెప్తూ స్టేట్మెంట్  ఇచ్చారు. శింబు లాంటి ప్రజాదరణ ఉన్న హీరో అలాంటి కామెంట్స్ చేయకూడదని, మరో హీరో కూడా ఎప్పుడూ ఇలాంటివి చేయటానికి సాహసించకూడదనే పోలీస్ కేసు పెట్టినట్లు చెప్తున్నారు.  

వివాదం ఏమిటి

నా సినిమాలకు ఇంతవరకు చేయనంత హంగామా చేయండి, భారీ ప్లెక్సీలు, పెద్ద పెద్ద కటౌట్లు కట్టండి, పాల ప్యాకెట్లతో కాదు పాల క్యాన్లతో పాలాభిషేకం చేయండి అంటూ తమిళ స్టార్ హీరో శింబు తన ఫ్యాన్స్ ని ఉద్దేశించి వీడియో విడుదల చేయటం...ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారింది.   ఇలా శింబు మాట్లాడటం వెనక పెద్ద కథే నడిచింది. 

తమిళంలో ఎప్పుడూ ఏదో  వివాదాల్లో ఉండే స్టార్‌ హీరో శింబు.. ప్రస్తుతం  'వంద రాజవతాన్ వరువేన్'  సినిమాతో అక్కడి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ అత్తారింటికి దారేది మూవీ రీమేక్‌ ఇది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఈ సినిమా రిలీజ్‌ కానున్న సందర్భంగా తన ఫ్యాన్స్ కు ఓ మెసేజ్ తో కూడిన వీడియో ని సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. 

ఆ మెసేజ్ లో ....థియేటర్ల వద్ద హంగామా చేయవద్దు, టిక్కెట్లను బ్లాక్‌లో కొనకండి, థియేటర్లలోనే చూడండి.. భారీ ప్లెక్స్‌లు, కటౌట్‌లు, పాలాభిషేకాలు చేయకండి.. డబ్బును వృథా చేయకండి. ఆ డబ్బుతో అమ్మానాన్నలు బాగా చూసుకోండి వారి తరువాతే ఎవరైనా అంటూ వీడియోను పోస్ట్‌ చేశాడు. 

అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం శింబును  సెటైర్స్ ఓ రేంజిలో వేసారు.  పబ్లిసిటీ స్టంట్‌ ఆపు, నీకు అంత సీన్‌ లేదు, నువ్వు అంత పెద్ద హీరోవి కాదను, నీకు ఉండేదే ఇద్దరు ముగ్గురు అభిమానులు  అంటూ వెటకారం చేస్తూ కామెంట్స్ చేసారు. 

ఇదంతా చూసిన శింబుకు మండినట్లుంది..దానికి .. వీటికి తన స్టైల్లో రిప్లై ఇస్తూ .. వెంటనే మరో వీడియోను షేర్‌ చేసారు. అందులో ....తాను ఇంతకు ముందు షేర్‌చేసిన వీడియోలో చెప్పిన వాటికి కొంతమంది నెగెటివ్‌గా కామెంట్‌ చేశారని, నాకు ఉన్నది ఇద్దరు ముగ్గురు ఫ్యాన్సేనని వారికే ఇది చెబుతున్నా అని.. ఇంతవరకు చేయనంత హంగామా చేయండని, భారీ ప్లెక్సీలు, పెద్ద పెద్ద కటౌట్లు కట్టండని, పాల ప్యాకెట్లతో కాదు పాల క్యాన్లతో పాలాభిషేకం చేయండంటూ తన స్టైల్లో   కౌంటర్‌ వేశాడు.