Asianet News TeluguAsianet News Telugu

కసితో అశ్విని ఫోటో నీళ్లలో ముంచేసిన శోభా.. తెల్ల చీర కట్టుకుని రాత్రి కలలోకి వస్తా అంటూ ప్రియాంక కామెంట్

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్ ఇలా ఉన్నాయి. కెప్టెన్సీ కంటెండర్స్ కోసం బిగ్ బాస్ ఆసక్తికర టాస్క్ ఇచ్చారు.

captaincy fight in bigg boss 7 house here is highlight dtr
Author
First Published Oct 20, 2023, 10:35 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7లో శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్ ఇలా ఉన్నాయి. కెప్టెన్సీ కంటెండర్స్ కోసం బిగ్ బాస్ ఆసక్తికర టాస్క్ ఇచ్చారు. అయితే వారు రేసులో ఉండాలా లేదా అనేది గులాబీ పురం వాళ్ళు నిర్ణయిస్తారు. 

కెప్టెన్సీ కంటెండర్స్ గా ఉన్న వారిలో నచ్చని వారిని తొలగించే ఛాన్స్ గులాబీపురం వాళ్లకు ఉంటుంది. బజర్ మోగినప్పుడు గులాబీ పురం సభ్యులలో ఎవరో ఒకరు చైన్ దక్కించుకోవాలి. తమకు నచ్చని కంటెండర్స్ ఫోటోని పూల్ ముంచి పోటీ నుంచి వారిని తప్పించాలి. అందుకు గల కారణం వివరించాలి. 

ఈ క్రమంలో శోభా శెట్టి ముందుగా గొలుసు దక్కించుకుంది. తాను అశ్విని ఫోటో నీళ్లలో ముంచి ఆమెని కెప్టెన్సీ పోటీ నుంచి తప్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో శోభా, అశ్విని మధ్య వాదోపవాదాలు జరిగాయి. శోభా శెట్టి కసితో అశ్విని ఫోటో పూల్ లో వేసేసింది. అలా అశ్విని కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత అమర్.. శివాజీ ఫోటోని నీళ్లల్లో ముంచేశారు. శివాజీ అమర్ నిర్ణయంతో ఆవేదన చెందారు. 

అనవసరంగా తనని తప్పించాడని శివాజీ అసహనం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ నాకు ఈ హౌస్ వద్దు.. నువ్వు వద్దు తలుపు తీస్తే వెళ్ళిపోతా అంటూ ఆగ్రహంతో మాట్లాడాడు. ఆయా తర్వాత పూజా.. ప్రశాంత్ ని కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి తప్పించింది. యావర్.. ప్రియాంక ని తప్పించాడు. ఎదుటివాళ్ళు ఏమి చెబుతున్నారో వినకుండా ప్రియాంక గొడవకు దిగుతుంది అని.. అలాంటి వ్యక్తికి కెప్టెన్ అయ్యే అర్హత లేదు అని యావర్ తెలిపాడు. 

ఈ క్రమంలో యావర్, ప్రియాంక మధ్య వాగ్వాదం జరిగింది. నేను హౌస్ లో అందరిని భయపడుతున్నానా.. నిజమే రోజు రాత్రి తెల్ల చీరకట్టుకుని కలలోకి వస్తున్నాను కదా అంటూ ప్రియాంక కోపం వ్యక్తం చేసింది. ఇక కెప్టెన్సీ కంటెండర్స్ గా మిగిలింది సందీప్, అర్హున్. వీళ్ళిద్దరూ కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. 

ఇంతలో బిగ్ బాస్ హౌస్ లో చిన్న సర్ప్రైజ్. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ మాన్షన్ 24 డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో రీసెంట్ గా స్ట్రీమింగ్ మొదలై క్రేజీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఓంకార్ హర్రర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సిరీస్ తెరకెక్కించారు. మాన్షన్ టీం హౌస్ లోకి సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది. హర్రర్ తరహాలో ఇంటి సభ్యులు గుహ లాంటి రూమ్ కి వెళ్లగా అక్కడ ఓంకార్, అవికా గోర్, వరలక్ష్మి శరత్ కుమార్, నందు ప్రత్యక్షమయ్యారు. విశేషం ఏంటంటే ఈ వెబ్ సిరీస్ లో ప్రస్తుతం హౌస్ లో ఉన్న అమర్ దీప్ కూడా నటించడం విశేషం. ఇంటి సభ్యులతో కాసేపు సరదాగా గడిపిన మ్యాన్షన్ టీమ్ ఆ తర్వాత తిరిగి వెళ్లారు. 

Follow Us:
Download App:
  • android
  • ios