ఇండియన్స్ ను ఛాలెంజ్ చేసిన క్యాప్ జెమినీ చైర్మన్.. ‘నాటు నాటు’ సాంగ్ లింక్ షేర్ చేసిన వ్యాపారవేత్త.. ఎందుకంటే?

దర్శకదీరుడు జక్కన్న తెరకెక్కించిన మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ చిత్రంపై క్యాబ్ జెమినీ కంపెనీ చైర్మన్ స్పందించారు. ‘నాటు నాటు’ సాంగ్ లింకును షేర్ చేస్తూ భారతీయులందరికీ సవాల్ విసిరాడు. 
 

Cap Gemini chairman challenges Indians shared the link to the song  Naatu Naatu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR). ఈ చిత్రం గురించి పక్కనేడితే.. ముఖ్యంగా సాంగ్స్ ఆడియెన్స్ ను ఎంతలా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ఇందులోనూ మరీ ముఖ్యంగా ‘నాటు నాటు’ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. ఈ సాంగ్ చిత్రీకరణను కూడా రాజమౌళి చాలా స్పెషల్ గా ఉక్రెయిన్ లోని  చారిత్రక కట్టడం వద్ద దాదాపు ఏడు రోజుల పాటు షూట్ చేశారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ మాస్ స్టెప్పులతో దుమ్ములేపారు. ముఖ్యంగా ఈ సాంగ్ లోని సిగ్నేచర్ స్టెప్ అందరినీ ఆకట్టుకుంది.

అయితే, తాజాగా ఈ బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని క్యాప్ జెమినీ (Cap Gemini) ఇంటర్నేషనల్ టెక్నాలజీ కంపెనీ చైర్మన్ పాల్ హెర్మెలిన్ (Paul Hermelin) చూశారు. రెండేండ్ల తర్వాత ఇండియాకు వచ్చిన పాల్ మూడు రోజుల పాటు భారత్ లో పర్యటించారు. తన స్నేహితుడి సలహా మేరకు ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ‘నాచో నాచో’ హిందీ వెర్షన్ సాంగ్ ను చూశారు. ఎన్టీఆర్, చెర్రీ నాటు డాన్స్ కు ఫిదా అయ్యారు.  దీంతో వెంటనే ఈ సాంగ్ లింకును తన లింక్డిన్ ఖాతాలో షేర్ చేస్తూ ఇండియన్స్ కు సవాల్ విసిరారు. ‘ఈ పాటకు మీరూ డ్యాన్స్ చేయగలరా? భారతీయులందరినీ నుంచి ఈ వారం వీడియోలను ఆహ్వానిస్తున్నాను’ అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు. అలాగే  ‘కొద్ది రోజుల కిందటి వరకు ఈ సాంగ్ కేవలం ఒక పాట మాత్రమే.. ఇప్పుడు ఒక ఆచారం.. ఉత్సవంలా మారిపోయిందని’ తెలిపారు. ఇదే విషయాన్ని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ తాజాగా నెటిజన్లతో పంచుకుంది. 

ప్రముఖ వ్యాపార వేత్త పాల్ పై తెలుగు సినిమా ప్రభావం చూపడటం విశేషం. మరోవైపు పాల్ పోస్ట్ కు నెటిజన్లు  స్పందిస్తున్నారు. డ్యాన్స్ వీడియోలను పంపే పనిలో పడ్డారు. ఇక ఈ నాటు నాటు సాంగ్ 74 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani) ఈ సాంగ్ కు క్యాచీ ట్యూన్ అందించారు. లిరిసిస్ట్ చంద్రబోస్ ‘నాటు నాటు’కు పక్కా మాస్ లిరిక్స్ ను అందించారు. సింగర్స్ రాహుల్ సింప్లిగంజ్, కాల భైరవ అద్భుతమైన గొంతుతో పాడారు. డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన ఈసాంగ్ ఇప్పటికీ దుమ్ములేపుతోంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios