నిన్నటి నుంచి వాట్సప్ లలో, ఫేస్ బుక్ లో  వెబ్ మీడియాలో అందరినీ షాక్ కు గురి చేస్తున్న వార్త షాహిద్ క‌పూర్‌కు కేన్స‌ర్? . ఈ దారుణమైన రూమర్ ని  ఎవరు పుట్టించారో.. ఏమో కానీ  బాలీవుడ్ లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. ఈ మధ్యకాలంలో వరస పెట్టి బాలీవుడ్ సెలబ్రెటీలు కాన్సర్ తో బాధపడుతున్న సమయంలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

ప్ర‌స్తుతం షాహిద్ కపూర్ హిందీ "అర్జున్ రెడ్డి" రీమేక్ "క‌బీర్ సింగ్" షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఊహిచని విధంగా షాహిద్ క‌పూర్‌కు కేన్స‌ర్ అంటూ వార్త‌లు రావటం అభిమానులకు షాక్ ఇచ్చింది. చాలా మంది ఫ్యాన్స్ ఆయనతో టచ్ లోకి వెళ్లటానికి ప్రయత్నించారు. మొదట ఈ విషయం గురించి షాహిద్ కు తెలియదు. దాంతో కంగారుపడ్డాడు. కానీ చివరకు అసలు విషయం విని ఆశ్చర్యపోయాడట. అయితే ఈ రూమర్ గురించి ఆయన స్పందించటానికి ఇష్టపడలేదు.

కానీ ఈ విషయమై  వెంట‌నే స్పందించారు క‌పూర్ కుటుంబం. అస‌లు ఇలాంటి చెత్త న్యూస్ ఎందుకు రాసి ఫ్యాన్స్ ను కంగారు పెడుతున్నారు అంటూ కోప్పడ్డారు వాళ్లు. షాహిద్ ఆరోగ్యంగా ఉన్నాడ‌ని.. ఇలాంటి అర్దం పర్దం లేని గాలి వార్త‌ల‌ను అస్స‌లు న‌మ్మొద్దంటూ వాళ్లు చెప్పారు. ప్ర‌స్తుతం షాహిద్ పూర్తి ఆరోగ్యంతో "అర్జున్ రెడ్డి" హిందీ రీమేక్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడ‌ని షాహిద్ భార్య మీరా రాజ్‌పుత్ చెబుతుంది.