టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న సమంత పెళ్లి తరువాత సరికొత్త కథలను ఎన్నుకుంటూ నటిగా తనలో కొత్త కోణాన్ని తెరపై ఆవిష్కరిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ కథలను ఎన్నుకుంటూ తన మార్కెట్ స్థాయిని మరింత పెంచుకుంటోంది.

అందుకే దర్శకనిర్మాతలు కూడా ఆమెతో కలిసి సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. 'యూ టర్న్' సినిమాతో సోలోగా వచ్చి తన క్రేజ్ ఏంటో నిరూపించింది. ఇప్పుడు ఈ బ్యూటీ నటించిన 'ఓ బేబీ' సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలట.

అయితే అంత సమయం పాటు సమంత ఆడియన్స్ ని థియేటర్ లో కూర్చోబెట్టగలదా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. సినిమాలో సమంత తప్ప ఆ రేంజ్ లో మరెవరూ కనిపించరు. నాగశౌర్య, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ వంటి తారలు ఉన్నప్పటికీ సినిమా మొత్తం సమంత చూట్టూ తిరిగే కథ కావడంతో ఆమె సోలోగా ఫైట్ చేయాల్సిందే.

తన స్టార్ డమ్ ని బట్టే సినిమాను నడిపించాల్సివుంటుంది. ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ రూ.16 కోట్ల వరకు అయింది. డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి సినిమాకు ఎలాంటి  రిజల్ట్ వస్తుందో చూడాలి!