ఆయన రాంచరణ్ తండ్రి, అందుకే ఫ్రేములో..అయోధ్య రామమందిరం వద్ద చిరుపై కెమెరా మెన్ కామెంట్స్, వైరల్ వీడియో
అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న వేళ దేశం మొత్తం భక్తి భావంతో నిండిపోయింది. ప్రజలంతా ఆ చారిత్రాత్మక క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. సినీతారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు.
అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న వేళ దేశం మొత్తం భక్తి భావంతో నిండిపోయింది. ప్రజలంతా ఆ చారిత్రాత్మక క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. సినీతారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. ప్రముఖులందరికి అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే.
రజనీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, కంగనా రనౌత్ సినీలోకం మొత్తం అయోధ్య చేరుకున్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కళ్లారా వీక్షించనున్నారు. చిరంజీవి , సురేఖ దంపతులు సతీసమేతంగా అయోధ్యకు వెళ్లారు. వీరి వెంట మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా ఉన్నారు.
చిరు కుటుంబానికి అయోధ్య విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఇప్పటికే సెలెబ్రిటీలంతా రామమందిరం వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నార్త్ లో రాంచరణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఇదో ఉదాహరణ అని చెప్పొచ్చు.
అక్కడ రాంచరణ్, చిరంజీవి ఇద్దరూ అనిల్ అంబానీతో కలసి ముచ్చటిస్తూ కనిపించారు. కెమెరామెన్ ఫ్రేములో ఎక్కువసేపు వారినే చూపిస్తూ ఉన్నారు. చాలా సేపటి నుంచి ఒకే దగ్గర కెమెరా పెట్టావు.. ఎవరున్నారు అని అడిగినట్లు తెలుస్తోంది. దీనితో కెమెరామెన్ సమాధానం ఇస్తూ.. అక్కడ రాంచరణ్ ఉన్నారు, రాంచరణ్ తండ్రి కూడా ఉన్నారు. అందుకే ప్రేములో ఉంచా అని చెప్పాడు.
సాధారణంగా అయితే చిరంజీవి కొడుకు రాంచరణ్ అని గుర్తు పట్టాలి. కానీ రాంచరణ్ తండ్రి ఆయన అని నార్త్ వాళ్ళు మాట్లాడుకునే రేంజ్ లో చరణ్ క్రేజ్ ఎగబాకింది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ అల్లూరి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో చరణ్ కి నార్త్ లో విపరీతమైన పాపులారిటీ దక్కింది.
రాంచరణ్ తండ్రిని మించిన తనయుడు అయ్యాడు అంటూ మెగా అభిమానులు ఈ వీడియో వైరల్ చేస్తున్నారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అయోధ్య చేరుకున్న సంగతి తెలిసిందే.