పూరి జగన్నాథ్  దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న ఐస్మార్ట్ శంకర్ వచ్చే నెల విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. చిత్రం చివరి   స్టేజి లో ఉండగా పూరికి ఓ కొత్త సమస్య వచ్చి వచ్చి పడింది. హైదరాబాద్ కు చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తి తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తన నిర్వహణలో ఉన్న ఇన్సట్రాగ్రమ్ పేజీలో ఇస్మార్ట్ శంకర్ పూర్తి స్క్రిప్ట్ పెట్టేస్తానని పూరికి బెదిరింపు పంపాడట. దీంతో ఎలెర్ట్ అయిన పూరి టీమ్ వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ కు నిన్న రిపోర్ట్ చేసింది. సదరు వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.  అంతవరకూ మనం మీడియాలో విన్నదే. అయితే అదే పేజీలో ఇప్పుడు మరో పోస్ట్ దర్శనమిస్తోంది. 

నిందితుడు మురళికృష్ణ  తాను వేరే సైట్ నుంచి ఆ స్క్రిప్ట్ కథ తీసుకున్నానని డబ్బులు డిమాండ్ చేయలేదని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు.  ఇప్పటికి ఆ సైట్ లో ఆ కథ అలాగే ఉందని అన్నారు. కేవలం తాను దాన్నే తన పేజీలో పెట్టానని,  ఆ చిత్రం ప్రమోషన్ టీమ్ అడగగానే తొలిగించామని చెప్పారు. అలాగే  ఇదంతా  సినిమా ప్రమోషన్  కోసం పూరి టీమ్  చేస్తున్న చీప్ ట్రిక్ అన్నట్లుగా అభివర్ణించారు.

దాంతో  ఈ కేసు గురించి లోతైన విచారణ మొదలైంది.  నిజంగా ఐస్మార్ట్ శంకర్ స్క్రిప్ట్ లీక్ అయ్యిందా లేదా సదరు పేజీ అడ్మిన్ పబ్లిసిటీ కోసం ఇదంతా చేశాడా అనే యాంగిల్ లో ఇన్వెస్టిగేషన్ జరుగుతోందిట. కానీ మధ్యలో పూరీనే తన సినిమా పబ్లిసిటీ కోసం ఇలాంటి హంగామా చేసాడని అనటం మాత్రం ట్విస్టే.