Asianet News TeluguAsianet News Telugu

త్రివిక్రమ్‌ మెచ్చిన `బుట్టబొమ్మ`.. ఆయన జోక్యం ఎంత? అసలు విషయం చెప్పిన మూవీ డైరెక్టర్‌

తెలుగులో వస్తోన్న  ఫ్రెష్‌ విలేజ్‌ నేపథ్య చిత్ర `బుట్టబొమ్మ`. టీజర్‌ ట్రైలర్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ అభినందించడం విశేషం. సినిమా చూసిన ఆయన చాలా బాగుందని అప్రిషియేట్‌ చేశారట. 

buttabomma impress trivikram movie director interesting comments
Author
First Published Feb 1, 2023, 8:53 PM IST

తెలుగులో వస్తోన్న  ఫ్రెష్‌ విలేజ్‌ నేపథ్య చిత్ర `బుట్టబొమ్మ`. టీజర్‌ ట్రైలర్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ ఫ్రెష్‌ కంటెంట్‌తో రాబోతున్న సినిమా అని క్రిటిక్స్, సినీ ప్రముఖులు సైతం దీన్ని ప్రశంసించడం, దీనికి గురించి మాట్లాడటంతో చిన్న సినిమా అయినా పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ అభినందించడం విశేషం. సినిమా చూసిన ఆయన చాలా బాగుందని అప్రిషియేట్‌ చేశారట. అంతేకాదు కొన్ని మార్పులు కూడా చెప్పారని తెలిపారు దర్శకుడు శౌరి చంద్రశేఖర్‌ రమేష్‌. అంతకు మించిన జోక్యం లేదని, ఆయన బిజీగా ఉన్నారని, తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని తెలిపారు. దర్శకుడిగా `బుట్టబొమ్మ` ఆయనకు తొలి చిత్రం. 

సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న చిత్రమిది. అందుకే దీనిపై అందరి అటెన్షన్‌ నెలకొంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 4న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శౌరి చంద్రశేఖర్‌రమేష్‌ బుధవారం మీడియాతో ముచ్చటించారు. పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. 

`బుట్టబొమ్మ` సినిమా ఎలా స్టార్ట్ అయ్యిందనే విషయం చెబుతూ, `లాక్ డౌన్ సమయంలో `కప్పేల` చిత్రాన్ని చూశా. కథనం పరంగా చాలా నచ్చింది. దీనిని మన అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేసి, రీమేక్ చేస్తే బాగుంటుందనే నమ్మకం కలిగింది. మలయాళ సినిమాలు `అయ్యప్పనుమ్ కోషియం`, `కప్పేల` రెండు చూసినప్పుడు తెలుగులో చేస్తే బాగుంటుంది అనిపించింది. అప్పటికే ఆ రీమేక్ హక్కులను సితార సంస్థ తీసుకొని, అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ ను సాగర్ చంద్రతో ప్రకటించారు. కప్పేల రీమేక్ చేయబోతున్నారని తెలిసి ఎడిటర్ నవీన్ నూలి ద్వారా చినబాబు, వంశీని కలిశాను. కొన్ని చర్చల తర్వాత నేను చేయగలనని నమ్మి ఈ అవకాశం ఇచ్చారు.

మెయిన్ పాయింట్ ని తీసుకొని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేశాం. ముఖ్యంగా ఫస్టాఫ్ లో కీలక మార్పులు చేయడం జరిగింది. కామెడీ, ఎమోషన్స్ మన అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేశాం. ఫస్టాఫ్ లో కథనం పరంగా ఒక పెద్ద మార్పు కూడా చేశాం. అది చూస్తే ఆ డైరెక్టర్ గారు కూడా ఈ ఆలోచన మనకు వస్తే బాగుండేది అనుకుంటారు అనిపిస్తుంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన అనిఖా సురేంద్రన్‌, సూర్య, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ముగ్గురికీ ఖచ్చితంగా మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. మూడు పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.

`బుట్టబొమ్మ` టైటిల్ గురించి చెబుతూ, సినిమాలోనే ఒక కాన్సెప్ట్ రన్ అవుతుంది. అది అనుకున్నప్పుడు అప్పటికే 'బుట్టబొమ్మ' సాంగ్ బాగా పాపులర్ కావడంతో అదే టైటిల్ పెడితే బాగుంటుందని నిర్మాత వంశీ సూచించారు. అలా ఈ టైటిల్ ఖరారైంది. రొమాంటిక్‌ సినిమాలకు ఆదరణ లేదనేది నేను నమ్మను. ఏ సినిమా అయినా జోనర్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించగలిగేలా తీస్తే.. ఖచ్చితంగా ఆదరణ పొందుతుందనే నమ్మకంగా ఉంది. చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేదు. ఫైనల్ గా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటే విజయం సాధిస్తుంది. సినిమా చూసి నిర్మాత చినబాబుగారు మెచ్చుకున్నారు. అలాగే త్రివిక్రమ్‌ కూడా చాలా బాగుందని అప్రిషియేట్‌ చేయడం మరింత నమ్మకాన్ని పెంచింది` అని దర్శకుడు తెలిపారు.  ఇదిలా ఉంటే రేపు(ఫిబ్రవరి 2)న సాయంత్రం `డీజే టిల్లు ఫేమ్‌ సిద్ధు జొన్నలగడ్డ గెస్ట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించబోతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios