ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ రోజు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది యూనిట్. టీజర్ డేట్‌ని ప్రకటించి ఖుషీ చేస్తుంది. తాజాగా `సలార్` అభిమానులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది యూనిట్.
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న మోస్ట్ ఆంటిసిపేటెడ్ మూవీ `సలార్`. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్, హోంబలే ఫిల్స్ కాంబినేషన్‌లో రూపొందిస్తున్న చిత్రమిది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి విడుదల చేసిన లుక్స్ సైతం ఆ అంచనాలను మరింత పెంచాయి. సినిమా విడుదలకు దగ్గరపడుతున్న అప్‌డేట్ లేదని చాలా కాలంగా ప్రభాస్ అభిమానులు గోల చేశారు. సోషల్ మీడియాలో యాష్ ట్యాగ్‌లతో ట్రోల్స్ చేశారు. అప్‌డేట్ కోసం డిమాండ్ చేశారు.
చాలా లేట్‌గా అయినా, లేటెస్ట్ గా స్పందించింది `సలార్` టీమ్. ఎట్టకేలకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. టీజర్ విడుదల చేయబోతున్నట్టు నేడు(సోమవారం) సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. జులై 6న `సలార్` టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, `సలార్` అభిమానులకు సైతం రెట్టింపు ఎనర్జీ వచ్చింది. ఇంతలో మరో క్రేజీ ఆఫర్ ప్రకటించింది యూనిట్. `సలార్`లో భాగమయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది.
తాజాగా ఓ అనౌన్స్ మెంట్‌ని ప్రకటించింది నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. `సలార్` జర్నీలో భాగమయ్యే అవకాశం కల్పిస్తుంది. `సలార్` సినిమాకి సంబంధించిన అత్యంత హింసాత్మక వ్యక్తికి సంబంధించిన సారాంశాన్ని సంగ్రహించి మీ ప్రతిభని ఉపయోగించి, క్రియేటివిటీని ఉపయోగించి డిజైన్‌లు, మంత్రముగ్దుల్ని చేసే వీడియోలను తయారు చేయాలని తెలిపింది. దీని ద్వారా అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాలని తెలిపింది. దీనికి సంబంధించి `సలార్` టీమ్ మిమ్మల్ని గమనిస్తుందని, బెస్ట్ చేసిన వారు `సలార్ ది సాగా`లో భాగమయ్యే అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు అని పేర్కొంది. మీ ఊహలకు రెక్కలు కట్టి, ప్రకాశంతో మమ్మల్ని ఆశ్చర్యపరచాలని పేర్కొంది సలార్ టీమ్. దీంతో ఆనందంలో మునిగిపోతున్నారు ఫ్యాన్స్. తమ టాలెంట్‌కి పని చెప్పే పనిలో బిజీగా ఉన్నారు.
ఇక జులై 6 గురువారం ఎర్లీ మార్నింగ్ `సలార్` టీజర్‌ని విడుదల చేయబోతుంది యూనిట్. ఓ సెంటిమెంట్‌గా దీన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక టీజర్ డేట్‌ని వెల్లడిస్తూ విడుదల చేసిన పోస్టర్ గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. ఎడమ చేతితో విలన్‌ని చంపుతూ, కుడి చేత్తే సిగరేట్(చుట్టా) పట్టుకుని బ్యాక్ సైడ్ నుంచి ఉన్న ప్రభాస్ లుక్ పూనకాలు తెప్పించేలా ఉంది. జస్ట్ లుక్కే ఇలా ఉంటే, ఇక టీజర్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనికోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న సినిమా విడుదల కాబోతుంది.
