#Bubblegum సుమ కొడుకు ‘బబుల్ గమ్’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన  ఈ మూవీ పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. అయితే రోషన్ నటనకు మంచి అప్లాజ్ దక్కింది. 

Bubblegum OTT streaming date and release partner details jsp

 సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతూ  బబుల్ గమ్ అనే టైటిల్ తో ఓ చిత్రం చేసిన సంగతి తెలిసిందే.  అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం, సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన కృష్ణ అండ్ హిస్ లీల దర్శకుడు రవికాంత్ పేరేపు బబుల్ గమ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. మానస చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.  ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన  ఈ మూవీ పెద్దగా వర్కవుట్ కాలేదనే చెప్పాలి. అయితే రోషన్ నటనకు మంచి అప్లాజ్ దక్కింది. ఈ క్రమంలో  ఈసినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా రాబోతుంది. తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వారు సొంతం చేసుకున్నారు.  ఫిబ్రవరి 9వ తేదీన ఈసినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది.  థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయచ్చు.

కథ ఏమిటంటే..   అదిత్య ( రోషన్ కనకాల)కి డీజే కావాలని కల . కానీ కుటుంబ పరిస్థితుల కారణంగా చాలా ఇబ్బందులు పడుతుంటాడు. ఓ పార్టీలో జాన్వీ (మాన చౌదరి)తో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారుతుంది. మొదట్లో ఆదిత్యతో ప్రేమగా టైమ్ పాస్ గా భావించిన జాన్వీ ఆ తర్వాత అతడి వ్యక్తిత్వం నచ్చి ఇష్టపడుతుంది. జాన్వీ పుట్టిన రోజు జరిగిన ఓ సంఘటన వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. అదే పార్టీలో ఆదిత్యను దారుణంగా అవమానిస్తుంది జా్వీ. ఆ తర్వాత ఏమైంది ?.. జాన్వీ చేసిన అవమానాన్ని ఆదిత్య ఎలా తీసుకున్నాడు ?.. రెండు విభిన్న నేపథ్యాలు కలిగిన వీరి ప్రేమ ఆఖరికి ఏం జరిగింది ?. అనేది సినిమా.
 
 బబుల్ గమ్ ఓటిటి రిలీజ్ పై అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇంకా ఈ మూవీలో హర్ష చెముడు, కిరణ్ జి, అనన్య ఆకుల, అను హాసన్, బిందు చంద్రమౌళి తదితరులు ఇతర కీలక పాత్రలు చేసారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios